శాస్త్రం ప్రకారం జుట్టు, గోర్లు ఎప్పుడంటే అప్పుడు కత్తిరిస్తే అంతే సంగతులు.. పూర్తిగా తెలుసుకోండి!

First Published Jan 19, 2022, 1:02 PM IST

పూర్వకాలంలో మన పెద్దలు ఏ పని చేసిన జ్యోతిష్య శాస్త్రాన్ని (Astrology) ఎక్కువగా నమ్మేవారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వాటిని అనుసరిస్తే ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు కలుగుతాయని బాధించేవారు. ఇప్పటికీ ఈ ఆచారాలను పాటించే వారు చాలా మంది ఉన్నారు. మరి కొందరు వీటిని మూఢనమ్మకాలుగా (Superstitions) భావించి వాటిని నమ్మరు. అయితే ఇప్పుడు మనం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జుట్టు, గోర్లు ఏ రోజున కత్తిరించుకుంటే ఎలాంటి శుభఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం..
 

చాలా మంది జుట్టు, గోర్లు పెరిగాయని వారికి తోచినప్పుడు కత్తిరిస్తుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు జుట్టు, గోర్లు కత్తిరించరాదని, శాస్త్రానికి విరుద్ధంగా (Contrary to science) కత్తిరిస్తే అనారోగ్య సమస్యలు (Health problems), ధన నష్టం జరుగుతుందని పెద్దలు చెబుతారు.
 

కనుక మన పెద్దలు జుట్టు, గోర్లను కత్తిరించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులను కేటాయించేవారు. జ్యోతిష్య శాస్త్రంలో ఏ రోజు జుట్టు, గోర్లు కత్తిరించుకుంటే ఎలాంటి శుభ ఫలితాలు (Good results) కలుగుతాయో స్పష్టంగా (Apparently) తెలియజేయడం జరిగింది.
 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రోజైనా జుట్టు కత్తిరించుకోవాలనుకున్నవారు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే కత్తిరించుకోవాలి. అలాగే అన్నదమ్ములు ఉన్న వారు ఒకే రోజున జుట్టు కత్తిరించుకోవడం మంచిది కాదు. సోమవారం (Monday) జుట్టు కత్తిరించుకుంటే సంపద, శ్రేయస్సు (Prosperity) పెరుగుతాయి.
 

అయితే సంతానం (Offspring) కోసం ఎదురు చూసేవారు, ఒకే కుమారుడు ఉన్నవారు సోమవారం రోజున జుట్టు కత్తిరించరాదు. మంగళవారం రోజున జుట్టు, గొర్లను  కత్తిరించకూడదు. ఇది శాస్త్రానికి విరుద్ధం. బుధవారం రోజు జుట్టు, గోర్లు కత్తిరించుకోవడం మంచిది. ఈ రోజు జుట్టు కత్తిరిస్తే ఆయుష్షు (Ayushshu) పెరగడంతో పాటు ఆరోగ్యం, సంపద కలసి వస్తాయి.
 

లక్ష్మీ దేవి కటాక్షం పొందాలంటే గురువారం (Thursday) రోజు ఎట్టిపరిస్థితిలోనూ జుట్టు కత్తిరించరాదు. గురువారం రోజు జుట్టు కత్తిరిస్తే పిల్లలలో ఆరోగ్య సమస్యలు, ధన నష్టం (Loss of money) ఏర్పడుతుంది. శుక్రవారం రోజు జుట్టు, గోర్లు కత్తిరించుకోవడం మంచిది కాదు. అక్కచెల్లెళ్లు ఉన్నవారు పొరపాటున కూడా శుక్రవారం జుట్టు కత్తిరించరాదు.
 

అదేవిధంగా శనివారం (Saturday) రోజున జుట్టు కత్తిరిస్తే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆదివారం రోజు చాలామంది జుట్టు, గోర్లు కత్తిరించడం చేస్తుంటారు. ఇలా పొరపాటున కూడా ఆదివారం (Sunday) జుట్టు కత్తిరించడం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆదివారం సాక్షాత్తు ఆ నారాయణుడికి ప్రీతికరమైన రోజు.
 

ఈ రోజున జుట్టు కత్తిరిస్తే ఆయుష్షు క్రమంగా తగ్గడంతో పాటు కుటుంబంలో కలహాలు (Conflicts), ఆర్థిక నష్టం (Financial loss) ఏర్పడే అవకాశం ఉంటుంది. జుట్టు కత్తిరించుకోవడానికి విదియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి వంటి తిథులు మంచివని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మంగళవారం, శనివారం, ఆదివారాలలో జుట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ కత్తిరించరాదు.

click me!