Anger: మీకు విపరీతమైన కోపమా..? ఈ గుడికి వెళితే.. ఎంత కోపమైనా తగ్గాల్సిందే?

Published : Sep 26, 2025, 09:22 AM IST

Anger: కోపం మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. కోపం వల్ల కొందరు ఆస్తిని, ఉద్యోగాన్ని, జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంది. మీకు కూడా అలాంటి కోపమే ఉంటే... కచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందే.. 

PREV
15
కోపాన్ని తగ్గించే ఆలయం..

కోపం అనేది కూడా ఒక ఫీలింగే. మనకు సంతోషం, బాధ, ఆకలి... ఎలానో.. కోపం కూడా అంతే. నచ్చని విషయాలు చూసినప్పుడు, జరిగినప్పుడు కోపం రావడం చాలా సహజం. కానీ... కొందరికి ఈ కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. అంతేకాదు.. వీరు కోపాన్ని కంట్రోల్ కూడా చేసుకోలేరు. ఆ సమయంలో వీరు ఏం చేస్తారు..? ఏం మాట్లాడతారు అనేది కూడా వారికి ఐడియా ఉండదు. ఇలా కోపం కారణంగా జీవితాన్ని కూడా ప్రమాదంలో పడేసుకుంటున్నవారిలో మీరు కూడా ఉంటే... ఒక ఆలయాన్ని దర్శించాల్సిందే. ఒక ఆలయాన్ని దర్శిస్తే... మీ కోపం పూర్తిగా తగ్గిపోయి.. శాంత మూర్తిలాగా తయారౌతారు. మరి, ఆ ఆలయం ఏంటి? దాని స్పెషాలిటీ ఏంటి? అక్కడ కొలువైన దైవం ఎవరు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం....

25
కోపంతో జీవితాన్ని నాశనం చేసుకోవడం..

కోపం అనేది మానవులకు, జంతువులకు సంబంధించిన సాధారణ విషయం. కొందరికి.. కోపాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎవరిమీద చూపించాలో బాగా తెలుసు. కానీ.. కొందరు అలా కాదు... వారికి అసలు కోపం విషయంలో కంట్రోల్ అనేది ఉండదు. ఆ సమయంలో ఏం చేస్తారో.. ఏం మాట్లాడతారో? ఎవరిని గాయపరుస్తారో..? ఏ వస్తువుల పగలకొడతారో చెప్పడం చాలా కష్టం. దీని వల్ల అనేక సమస్యలు కొని తెచ్చుకుంటారు. అందుకే... ఆ కోపం తగ్గించుకోవాలి.

35
కోపం వల్ల కలిగే నష్టాలు...

కొంతమంది తమ ఉన్నతాధికారుల అసంతృప్తి కారణంగా కోపంతో ఉద్యోగాలను వదిలివేసి ఉండవచ్చు. తర్వాత వారు ఉద్యోగం దొరకకుండా తిరుగుతూ ఉండవచ్చు. మరికొందరు తమ సొంత బంధువులు, తోబుట్టువులపై కోపంగా ఉండవచ్చు. వారి నుండి దూరమై ఉండవచ్చు. మరికొందరు తమ భార్య లేదా భర్తతో విభేదాల కారణంగా కోపంతో విడిపోయి ఉండవచ్చు. అలాంటివారు ఈ సుబ్రహ్మణ్యేశ్వరు ఆలయాన్ని కచ్చితంగా సందర్శించాల్సిందే.

45
తిరుమురుగనాథేశ్వర ఆలయం..

ఈ ఆలయం తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా, తిరుమురుగన్ పూండి అరుల్మిగులో ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడ పూజిస్తారు. ఈ ఆలయానికి వస్తే... ఎంత కోపం అయినా తగ్గిపోతుందని నానుడి. పూర్వం దుర్వాసుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి విపరీతమైన కోపం. స్థానిక ఇతిహాసాల ప్రకారం, అతను ఈ ప్రదేశానికి వచ్చి శివుడిని , సుబ్రహ్మణ్య స్వామిని పూజించాడు. తన కోపం వల్ల చేసిన పాపాలను పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి కోపం తగ్గించుకోవడానికి అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే... ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి తన వాహనం నెమలి లేకుండా సింగిల్ గానే దర్శనమిస్తారు.

55
ఈ ఆలయానికి వెళ్లే భక్తులు ఎవరంటే....

కోపం వల్ల చాలా నష్టపోయిన వారు , జాతక దోషాలతో బాధపడుతున్న వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ముఖ్యంగా మంగళవారాల్లో ఈ ప్రదేశాన్ని సందర్శించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు. భక్తులు శివుడిని , సుబ్రహ్మణ్య స్వామిని పూజించడానికి నెయ్యి దీపాలను వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల కోపం తగ్గుతుందని నమ్ముతారు.

Read more Photos on
click me!

Recommended Stories