Bhagavad Gita: జీవితంలో కష్టాలన్నీ ఒకేసారి వచ్చినట్లు అనిపిస్తున్నాయా..? ఇవి ఫాలో అయితే చాలు..!

Published : Sep 24, 2025, 11:50 AM IST

Bhagavad Gita: అయిదు వేల సంవత్సరాల క్రితం అర్జునుడికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. కురుక్షేత్ర యుద్ధ భూమిలో తన బంధువులు, గురువులు, ప్రియమైనవారితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

PREV
14
భగవద్గీత ఏం చెబుతోంది?

జీవితం ఎప్పటికప్పుడు మనకు ఊహించని ట్విస్టులు ఇస్తూనే ఉంటుంది. జీవితం సాఫీగా సాగుతుంది అనుకునేలోపు ఏదో ఒక కష్టం వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి కష్టాలన్నీ చుట్టాల్లా ఒకేసారి వచ్చి చుట్టుమూట్టేస్తూ ఉంటాయి. అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు రావడం, ఆర్థిక నష్టం, ప్రియమైన వారి ద్రోహం చేయడం ఇలా అన్నీ ఒకేసారి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఎవరికైనా జీవితంపై విరక్తి వచ్చేస్తుంది. కొందరు అయితే... ఇలాంటి కష్టాలు తట్టుకోలేక ఆత్మహత్యకు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ.. గీతలో కృష్ణుడు చెప్పింది వింటే మీ సమస్యల నుంచి కచ్చితంగా బయటపడతారు.

అయిదు వేల సంవత్సరాల క్రితం అర్జునుడికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. కురుక్షేత్ర యుద్ధ భూమిలో తన బంధువులు, గురువులు, ప్రియమైనవారితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో అర్జునుడి చేతులు వణికాయి. విల్లు చేతిలో నుంచి జారిపోయింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశమే భగవద్గీత.

24
ధర్మాన్ని స్వీకరించడం....

శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ప్రధాన బోధ... నీ ధర్మన్ని పరిగణనలోకి తీసుకొని, తడపడకుండా చేయాల్సిన పని చేయి. జీవితం ప్రతి ఒక్కరిపై ప్రత్యేకమైన బాధ్యతలను పెడుతుంది. అవి ఎప్పుడూ సులభంగా ఉండవు. మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు అసంపూర్ణంగా, నొప్పి కలిగించేలా ఉండొచ్చు. అయినప్పటికీ ధర్మాన్ని అనుసరించడం ద్వారా మనం సమగ్రతను కాపాడుకోవచ్చు.

34
అనుబంధం – బాధకు మూలం

భగవద్గీత ప్రకారం.. “ఇంద్రియ విషయాలపై ఆలోచించడం అనుబంధాన్ని కలిగిస్తుంది. అనుబంధం కోరికగా మారుతుంది, కోరిక విఫలమైతే కోపాన్ని తెస్తుంది.” అంటే, కష్టాన్ని ఎదుర్కోవడంలో ప్రధాన అడ్డంకి వాస్తవం వేరుగా ఉండాలని కోరుకోవడమే. మనం ఫలితాలను నియంత్రించలేము. మనం చేయగలిగేది — మన కర్తవ్యాన్ని నిజాయితీతో నిర్వర్తించడం మాత్రమే.

సమతౌల్యం – నిజమైన యోగా

శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: “విజయం లేదా వైఫల్యం పట్ల అనుబంధం లేకుండా నీ విధిని నిర్వర్తించు. అలాంటి సమతౌల్యాన్ని యోగా అంటారు.”

మన చేతిలో లేని ఫలితాలకంటే, మన ప్రతిస్పందనపై నియంత్రణ కలిగి ఉండడమే మన బలం. సంక్షోభం వచ్చినా, మనం మన కేంద్రాన్ని నిలుపుకుంటే స్థితప్రజ్ఞులమవుతాము.

44
చివరి బోధన – లొంగిపోవడం

“అన్ని ధర్మాలను విడిచి, నాకు మాత్రమే లొంగిపో. నేను నిన్ను అన్ని పాపప్రభావాల నుండి రక్షిస్తాను; భయపడవద్దు.”

అంటే, మనం చేయగలిగినంత చేశాక ఫలితాన్ని నియంత్రించలేమని అంగీకరించడం. ఆ విశ్వాసంతో ముందుకు సాగితే, ఎంత కఠినమైన సంక్షోభం అయినా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. చేయడం మన ధర్మం.. ఫలితం ఇలానే ఉండాలని ఆశించకూడదు అని దీని అర్థం.

భగవద్గీత ప్రకారం.. జీవితం తప్పక కఠినమైన పరీక్షలను ఇస్తుంది. కానీ వాటిని ఎదుర్కోవడంలో మన బలం ధర్మం, సమతౌల్యం, దయ, విశ్వాసం లోనే ఉంది. కష్టాలు వచ్చినా, సమగ్రతతో వ్యవహరిస్తూ, మన అంతరంగాన్ని స్థిరంగా ఉంచినప్పుడు మాత్రమే నిజమైన శాంతి లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories