ఈ రాశి వారికి స్వల్ప మేలు జరుగుతుంది. చంద్రుడు, శుక్రుడితో కలవడం శుభ పరిణామాలకు సంకేతం. అదే విధంగా రాహువు కూడా కలిసి ఉండటం ఈ రాశు వారికి కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. బుధుడు ఆర్థిక ప్రయోజనాలకు సహకరిస్తుంటే, రాహువు జీవితంలో చికాకులు తెచ్చి పెడుతుంటాడు. ఆర్థిక లబ్ది చేతికి అందినట్టే అంది చేజారిపోతుంటుంది. పని భారం ఎక్కువ అవుతుంది. ఊహించని ఖర్చులు ఎదరుర్కోవాల్సి వస్తుంది. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటే బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది.