Spiritual : నవరాత్రి అఖండ దీపం వెలిగించేటప్పుడు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

First Published Oct 9, 2023, 1:35 PM IST

 Spiritual : దసరా నవరాత్రులప్పుడు చాలామంది అఖండ దీపం వెలిగిస్తారు. అయితే చాలామందికి ఈ దీపం గురించి పెద్దగా అవగాహన ఉండదు. అందుకే ఈ దీపం పెట్టేటప్పుడు తీసుకోవలసిన నియమాలు, గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 

 చాలామందికి దసరా నవరాత్రులప్పుడు అఖండ దీపం వెలిగించడం ఒక సాంప్రదాయం. ఇలా చేయడం వలన ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటుందని నమ్మకం. దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది నవరాత్రులలో ఉపవాసం ఉంటారు.

 నియమనిబంధనల ప్రకారం పూజిస్తారు. అఖండ జ్యోతిని కూడా అప్పుడే వెలిగిస్తారు. అయితే అఖండ దీపం వెలిగించే సమయంలోనూ, వెలిగించిన తర్వాత కూడా కొన్ని నియమాలు పాటించాలి అవి ఏమిటో చూద్దాం. అఖండ దీపాన్ని ఇత్తడి లేదా మట్టి దీపంలో మాత్రమే వెలిగించాలి.
 

 దీపం తొమ్మిది రోజులపాటు  కొండెక్కకుండా చూసుకోవాలి. దీపం వెలిగించిన తర్వాత నేలపై ఉంచకూడదు. ప్లేట్లో అక్షింతలు వేసి దానిపై దీపాన్ని పెట్టాలి. దీపం 9 రోజులు పాటు ఆరిపోకుండా వెలుగుతూనే ఉండాలి. దీపం ఒత్తిగా కాటన్ బట్టని ఉపయోగించండి. దీపాన్ని గాలి తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
 

Navratri 2023

దీపంలో నెయ్యి లేదా నువ్వుల నూనె వేస్తూ ఉండాలి. దీపంలో నెయ్యి లేదా నూనె వేసిన తరువాతే నిద్రించాలి. దీపాన్ని తరచుగా మార్చకూడదు. అలాగే ఈ తొమ్మిది రోజులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి, సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి.తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత అఖండ దీపాన్ని మీరు స్వయంగా ఆర్పవద్దు. అది దానంతట అదే ఆరిపోవాలి.
 

దీపాన్ని స్వయంగా ఆర్పడం అశుభం. అఖండ దీపాన్ని ఇంట్లో వెలిగించడం వల్ల ఇంట్లో సానుకూలత వ్యాప్తిస్తోంది. ప్రతికూల శక్తి నుండి ఇంటిని రక్షిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. జీవితంలో కోరికలను నెరవేర్చటంలో మరియు ప్రేమ, ఆరోగ్య సమృద్ధి వంటి విషయాలలో సానుకూల దృక్పథం చూపిస్తుంది. అఖండ జ్యోతిని వెలిగించేటప్పుడు ఈ మంత్రాన్ని 11 సార్లు జపించాలి.

 శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద|
 శత్రు బుద్ధి వినాశాయ దీపకాయ నమోస్తుతే||
 దీపో జ్యోతి పరం బ్రహ్మ దీపో జ్యోతిర్జనార్ధనః |
 దీపో హరతు మే పాపం సంధ్యా దీప నమోస్తుతే ||
 ఈ మంత్రాన్ని జపిస్తూ దీపం వెలిగించడం వల్ల అమ్మవారి కరుణాకటాక్షాలు లభిస్తాయి.

click me!