ఏ దేవుడికి ఏ దీపం వెలిగిస్తే శుభం జరుగుతుంది

First Published | Oct 7, 2023, 9:39 AM IST

ప్రతిరోజూ ఇంట్లో పూజ చేయడం వల్ల ఇంట్లో సంతోషం, శాంతి నెలకొంటాయని నమ్ముతారు. అయితే దేవుళ్లను పూజించేటప్పుడు ఖచ్చితంగా దీపం వెళిగిస్తారు. హిందూమతంలో ఒక్కో దేవతను ఆరాధించే విధానం వేరుగా ఉంటుంది. అంటే ఒక్కో దేవతలకు ఒక్కో రకం దీపాన్ని వెళిగించాలన్న మాట.

చాలా మంది రెగ్యులర్ గా పూజలు చేస్తుంటారు. పూజ చేస్తేనే ఇంట్లో అంతా సవ్యంగా ఉంటుందని నమ్ముతారు. అయితే పూజ చేసే సమయంలో దీపాన్ని ఖచ్చితంగా వెలిగిస్తారు. దూపదీపాలు దేవుడికి తప్పనిసరిగా సమర్పిస్తారు. అయితే హిందూమతంలో భోగం, పువ్వులు, మంత్రాలు ఒక్కో దేవతకు ఒక్కోలా ఉంటాయి. ఈ సంగతి అందరికీ తెలుసు. అలాగే దేవుళ్లకు దీపం వెలిగించే నియమం కూడా వేరుగా ఉంటుందన్న సంగతి చాలా మందికి తెలియదు. అవును ఒక్కో దేవుడికి ఒక్కోరకమైన దీపాన్ని వెలిగించాలి. అప్పుడే దేవుళ్ల అనుగ్రహం మనపై ఉంటుంది. మరి ఏ దేవుడికి ఏ దీపం వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

నెయ్యి దీపం

లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. నెయ్యి దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఆవు స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది. అలాగే మీ ఇంట్లో నెగిటీవ్ ఎనర్జీ పోతుంది. ఈ దీపం వాస్తు దోషాన్ని కూడా పోగొడుతుంది. అందుకే సాయంత్రం పూట మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించండి. 
 


ఆవనూనె దీపం

శని దేవుడికి ఆవనూనె దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే శని దేవుడికి ఆవ నూనె అంటే చాలా ఇష్టమట. శనిదేవుడికి ఆవనూనె దీపాన్ని వెలిగించడం వల్ల మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే మీ ప్రతి పనిలో విజయం సాధిస్తారు. భైరవ దేవత ఆరాధనకు కూడా ఆవనూనె దీపాన్ని వెలిగిస్తారు. దీన్ని శుభప్రదంగా భావిస్తారు.
 

నువ్వుల నూనె 

రాహు-కేతు ప్రభావం నుంచి విముక్తి పొందుడానికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం వల్ల మీకు శనిగ్రహం బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
 

మల్లె నూనె దీపం

హనుమంతుడికి మల్లెనూనె దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు. ఈ నూనె దీపం వెలిగించడం వల్ల హనుమంతుడిని ప్రసన్నం చేసుకుంటారు. మల్లె నూనె దీపాన్ని మూడు మూలల్లో వెలిగించడం వల్ల మీరు అనుగ్రహం పొందుతారు. 

Latest Videos

click me!