Spiritual: బద్రీనాథ్ ఆలయంలో ఈ పనులు అస్సలు చేయకూడదు.. చేస్తే పాపం అంటుకుంటుంది!

Published : Oct 06, 2023, 02:29 PM IST

 Spiritual : సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే తెరిచి ఉండే బద్రీనాథ్ ఆలయానికి చాలా విశిష్టతలు ఉన్నాయి. అలాంటి పవిత్రమైన ఆలయంలో ఈ పనులు అస్సలు చేయకూడదట, చేస్తే పాపం అంటుకుంటుంది అంటారు పెద్దలు. అదేంటో తెలుసుకుందాం.  

PREV
16
 Spiritual: బద్రీనాథ్ ఆలయంలో ఈ పనులు అస్సలు చేయకూడదు.. చేస్తే  పాపం అంటుకుంటుంది!

 బద్రీనాథ్ ఆలయానికి మహా విశిష్టత ఉంది. పురాణాల ప్రకారం సత్య యుగం వరకు  వరకు భక్తులందరూ ఇక్కడ విష్ణుమూర్తి దర్శనం పొందుతారు. త్రేతాయుగంలో దేవతలు, ఋషులు మాత్రమే శ్రీహరి దర్శనం చేసుకునేవారు. బద్రీనాథ్ ని శ్రీమహావిష్ణువుకి రెండో నివాసం అని అందుకే దీన్ని రెండో వైకుంఠం అని పిలుస్తారు.
 

26

 ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయంలో శంఖాన్ని పూరించకూడదని చెప్తారు. పురాణాల ప్రకారం  బద్రీనాథ్ కి చెందిన ఇద్దరు రాక్షసులలో ఒక రాక్షసుడు శంఖంలో దాక్కున్నాడని శంఖాన్ని పూరించడం వలన ఆ రాక్షసుడు బయటికి వస్తాడు.
 

36

 కాబట్టి బద్రీనాథ్ గుడి వద్ద శంఖం పూరించకూడదని చెప్తారు. అంతేకాకుండా ఈ ఆలయంలో ఇంకా చాలా విశిష్టతలు ఉన్నాయి. బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరిచినప్పుడు యోగ బద్రిపై అమర్చిన నెయ్యి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

46

 అక్కడ ఉండే బద్రీనాథ్ విగ్రహాన్ని ఎవరు ముట్టుకోకూడదనేది నియమం ఉంది. ఈ బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అలకనంద నది తీరాన నర, నారాయణ అనే రెండు పర్వతాల మధ్య ఉంది. హిందూ పురాణాల ప్రకారం బద్రీనాథ్ ఆలయంలో మానవులో వేసవికాలం నుంచి ఆరు నెలల పాటు శ్రీహరిని పూజిస్తారు.

56

 తర్వాత శీతాకాలం నుంచి ఆరు నెలల పాటు దేవతలు పూజిస్తారు. దేవతలకు ప్రతినిధిగా నారద ముని పూజిస్తారు. ఆలయ తలుపులు మూసి ఉన్నప్పుడు నారదుడు ఆఖండ జ్యోతిని వెలిగిస్తారు అనేది స్థల పురాణం.
 

66

 బద్రీనాథ్ ఆలయాన్ని తిరిగి తెరిచినప్పుడు అక్కడ వెలిగి ఉండే అఖండ జ్యోతి దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో అతింద్రీయ కాంతిని చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. అఖండ జ్యోతిని చూసినవారికి పాపం నుంచి విముక్తి చెంది మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

Read more Photos on
click me!

Recommended Stories