విరాట్ కోహ్లీ, అనుష్క ల కూతురు, కొడుకు పేర్లకున్న స్పెషాలిటీ ఇదే..!

First Published Feb 22, 2024, 9:44 AM IST

Spiritual Baby Names: ఫిబ్రవరి 15 న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క శర్మ రెండో బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. వీరికి పండంటి మగబిడ్డ జన్మించారు. అప్పుడే ఈ బిడ్డకు పేరు కూడా పెట్టేసారు. ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.నిజానికి ఈ స్టార్ దంపుతుల కూతురు, కొడుకు పేర్లకు ఎంతో ప్రాముఖ్యత, అర్థం ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
 

ప్రతి వ్యక్తి పేరు అతని గుర్తింపుగా మారుతుంది. అందుకే పేరు పెట్టేటప్పుడు ఎన్నో విషయాలను గుర్తుంచుకోవాలంటారు పెద్దలు. సనాతన ధర్మంలో పిల్లల ఆధ్యాత్మిక నామాన్ని పెట్టడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ రోజుల్లో దీని ట్రెండ్ కూడా బాగా పెరిగిపోయింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు తమ పిల్లలకు మతపరమైన పేర్లను ఎంచుకోవడం మొదలుపెట్టారు. దీనికి బెస్ట్ ఉదాహరణ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పిల్లల పేర్లు. వీరి పిల్లల పేర్లు చాలా ప్రత్యేకమైనవి. మరి వీరి పిల్లల పేర్లకు అర్థాలు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం పదండి.
 

Anushka Sharma, Virat Kohli

అకాయ్ అంటే అర్థం

ఆకాయ్ అంటే రూపరహితుడు అంటే 'రూపం లేనివాడు' అని అర్థం. ఈ అర్థంలో.. ఈ పదం శివుడిని సూచిస్తుంది. ఎందుకంటే సనాతన విశ్వాసాల ప్రకారం.. శివుడు రూపరహితుడుగా కూడా పరిగణించబడతాడు. అలాగే టర్కిష్ భాషలో అకాయ్ అనే పదానికి అర్థం కూడా చాలా ప్రత్యేకమైనది. టర్కిష్ భాషలో.. అకాయ్ అంటే ప్రకాశించే చంద్రుడు లేదా పౌర్ణమి అని అర్థం.
 

వామికా

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల కుమార్తె పేరు వామిక. ఈ పేరుకు కూడా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. వామిక అంటే దుర్గాదేవి అని అర్థం వస్తుంది. అలాగే ఈ పేరుకు శివపార్వతుల మిశ్రమ రూపం అని కూడా అర్థం వస్తుందట.

కొడుకులకు ఈ మతపరమైన పేర్లను పెట్టొచ్చు..

విభూ - ఇది ఒక ప్రత్యేకమైన పేరు. అలాగే చాలా అందమైన పేరు కూడా. ఈ పేరును లోక పోషకుడైన విష్ణువుకు ఉపయోగిస్తారు. అలాగే ఈ పేరు బలానికి కూడా చిహ్నం.

అద్వైత్ - సంస్కృతంలో ఈ పేరుకు అర్థం - ఆత్మ, భగవంతుడి కలయిక. మీరు మీ కొడుక్కి ఈ ఆధ్యాత్మిక పేరును పెట్టొచ్చు.
 

కుమార్తెలకు మతపరమైన పేర్లు

ద్విత - ద్విత అనేది సంస్కృత పేరు. దీని అర్థం 'రెండు రూపాల్లో ఉంది'. ఈ పేరుకు లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. ఈ పేరు జీవిత ద్వంద్వత్వాన్ని సూచిస్తుంది.

ఈశ్వా - ఈ పేరు కూడా చాలా ప్రత్యేకమైంది. ఈ పేరుకు.. ఆధ్యాత్మిక గురువు అని అర్థం వస్తుంది.మీ కూతురికి ఈశ్వ అనే పేరును పెట్టొచ్చు. 

click me!