హిందూ మతంలో మాఘ పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతినెలా శుక్లపక్ష పౌర్ణమి నాడు విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ఈ దేవుళ్ల అనుగ్రహం ఉంటే జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. అందుకే మాఘ పూర్ణిమ శుభ సమయం, పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మాఘ పూర్ణిమ శుభ సమయం
పౌర్ణమిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. మాఘ మాసం పౌర్ణమి ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 03.33 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 24 న సాయంత్రం 05.59 గంటలకు ముగుస్తుంది. సనాతన ధర్మంలో ఉదయ తిథికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 24 అంటే శనివారం నాడు మాఘ పూర్ణిమ జరుపుకుంటారు.
మాఘ పూర్ణిమ పూజా విధి
మాఘ పూర్ణిమ నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. సంపదకు తల్లి అయిన విష్ణువు, లక్ష్మీదేవిలను ధ్యానించడం ద్వారా రోజును ప్రారంభించాలి.
స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి.
ఆ తర్వాత నల్ల నువ్వులు, కుంకుమలను నీటిలో కలిపి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.
తర్వాత విష్ణువు, లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి.. పూలు, నువ్వులు, బార్లీ, అక్షతలు, గంధం, పసుపు మొదలైనవి సమర్పించండి.
దేవుడి ముందు నెయ్యి దీపం వెలిగించి భగవంతునికి హారతి ఇచ్చి విష్ణు చాలీసా పఠించండి.
చివరగా సంతోషం, శ్రేయస్సు, సంపద పెరుగుదల కోసం దేవుడిని ప్రార్థించండి.