పిల్లి ఏడుపు మంచిదా? చెడ్డదా?

First Published Feb 20, 2024, 3:03 PM IST

రాత్రిళ్లు పిల్లి ఏడుపు ఎక్కువగా వినిపిస్తుంటుంది. చాలా పిల్లలు కంటిన్యూగా కొద్ది సేపటి వరకు ఏడుస్తూనే ఉంటాయి. శకున శాస్త్రం ప్రకారం.. పిల్లి ఏడుపు మంచిదా? చెడ్డదా? తెలుసుకుందాం పదండి. 
 

cat


సనాతన ధర్మంలో.. శకున శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎన్నో విషయాలు గ్రంథాలలో ప్రస్తావించబడ్డాయి. అవి మనిషి జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలను సూచిస్తాయి. మన చుట్టూ ఏదైనా జరిగితే, అది ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఇస్తుంది. ఇది మనకు ఒక విషయాన్ని కూడా చెప్తుంది. ఇలా పిల్లి ఏడుపు గురించి కూడా శకున శాస్త్రంలో ప్రస్తావించారు. మీలో చాలా మంది పిల్లి ఏడుపును వినే ఉంటారు. అయితే చాలా మంది పిల్లి ఏడుపును అశుభంగా భావిస్తారు. అందుకే ఏడుస్తున్న పిల్లిని తరుముతారు. అసలు శకున శాస్త్రం ప్రకారం.. పిల్లి ఏడుపు శుభమా? అశుభమా? అనరేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

మంచిదా? చెడ్డదా?

శకున శాస్త్రం ప్రకారం.. ఇంటి బయట పిల్లి ఏడుపు అశుభంగా పరిగణించబడుతుంది. పిల్లి ఏడుపు ఏదో అవాంఛనీయతను సూచిస్తుందని జ్యోతిష్యులు చెప్తారు. ఇది కుటుంబ సభ్యులకు ఏదైనా పెద్ద సమస్యలను కలిగిస్తుంది.

సంకేతాలు ఇవే..

పిల్లి మీ ఇంటి బయట ఏడుస్తుంటే.. ఆ వ్యక్తి జీవితంలో ఏదో చెడు జరగబోతోందని లేదా మీరు ఏదైనా సమస్యను ఎదుర్కోవలసి ఉంటుందని అర్థం వస్తుంది. అలాగే మీరు ఏదైనా పని మీద ఎక్కడికైనా వెళ్తుంటే, పిల్లి అకస్మాత్తుగా దారికి అడ్డువస్తే కూడా అశుభంగా భావిస్తారు. మీరు చేయబోయే పని పూర్తికాదు. అలాగే దానిలో మీరు విజయం సాధించలేరు సంకేతం వస్తుంది. 

- పిల్లి రహస్యంగా మీ ఇంటికి వచ్చి పాలు తాగితే అది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది.

- దీపావళి రోజున పిల్లి ఇంటికి రావడం శుభప్రదం. ఈ సందర్భంగా పిల్లి ఇంటికి రావడం వల్ల సంపద ఎప్పుడూ నిండుగా ఉంటుందని నమ్ముతారు.

click me!