వర్క్ డెస్క్ మీద దేవుళ్ల విగ్రహాలను పెట్టొచ్చా?

First Published Feb 18, 2024, 9:47 AM IST

హిందూ మతంలో.. దేవుళ్ల విగ్రహాలను పూజించడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే దేవుళ్ల విగ్రహాలను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. మరి వర్క్ డెస్క్ పై దేవుళ్ల విగ్రహాలను పెట్టాచ్చా? లేదా? ఒకవే పెడితే ఏ విగ్రహాలను పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

దేవుళ్లు, దేవతల విగ్రహాలను పెట్టడానికి సంబంధించిన ఎన్నో నియమాల గురించి వాస్తు శాస్త్రంలో వివరించడి ఉంది. దేవుడి విగ్రహాలను ఇంట్లోని దేవుడి గుడిలోనే కాకుండా.. ఇంట్లో అక్కడక్కడ పెడుతుంటారు. కొంతమంది ఆఫీస్ డెస్క్, స్టడీ డెస్క్ మీద కూడా దేవుళ్ల విగ్రహాలను, ఫోటోలను పెడుతుంటారు. జ్యోతిష్యుల ప్రకారం.. వర్క్ డెస్క్ పై దేవుళ్ల విగ్రహాలను పెట్టొచ్చో? లేదో? ఇప్పుడు  తెలుసుకుందాం పదండి. 

వినాయకుడి విగ్రహం 

వినాయకుడే తొలిపూజలు అందుకుంటారు. విఘ్నాలను తొలగించే వినాయకుడిని ముందుగా పూజించడం వల్ల మనం చేపట్టే పనులకు, శుభకార్యాలకు ఎలాంటి ఆటంకాలు రావని నమ్ముతారు. అయితే మీరు మీ  ఆఫీసు డెస్క్ పై వినాయక విగ్రహాన్ని లేదా మీకు ఇష్టమైన దేవుడి విగ్రహాన్ని మాత్రమే పెట్టాలి. లేదంటే మీకు చెడు జరుగుతుంది. 
 

 రెండు దేవుళ్ల విగ్రహాలను ఉంచొద్దు

మీకు ఎలాంటి అశుభం జరగొద్దన్నా మీరు మీ ఆఫీసు డెస్క్ పై రెండు దేవుళ్ల విగ్రహాలను ఉంచకూడదు. ఇలా రెండు దేవుళ్ల విగ్రహాలను పెడితే మీకు చెడు జరుగుతుంది.
 

kubera

కుబేరుడి విగ్రహం 

కుబేర విగ్రహాలు అందరి ఇళ్లలో ఉంటాయి. ఈ విగ్రహం ఉంటే ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదని చాలా మంది నమ్ముతారు. కానీ కుబేర విగ్రహాన్ని కేవలం డబ్బు ఉండే ప్రదేశంలో లేదా పూజా గదిలోనే పెట్టాలి. కుబేర యంత్రాన్ని పొరపాటున కూడా ఆఫీసు డెస్క్ పై పెట్టకండి. 

లక్ష్మీదేవి విగ్రహం 

కావాలనుకుంటే మీరు మీ ఆఫీసు డెస్క్ పై లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టొచ్చు. ఇది మీ జీవితంలో సంపదను పెంచుతుంది. మీ  ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా ఉంచుతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడూ ఆర్థిక నష్ట సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం కూడా రాదు. 
 

laughing buddha

లాఫింగ్ బుద్ధ 

మీ ఆఫీసు డెస్క్ పై లాఫింగ్ బుద్ధుడి విగ్రహాన్ని కూడా పెట్టొచ్చు. అయితే లాఫింగ్ బుద్ద విగ్రహాన్ని ప్రతి రోజూ శుభ్రం చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది డబ్బును మీ వైపు ఆకర్షిస్తుంది. అలాగే డబ్బుకు ఎప్పుడూ కొరత ఉండదు.
 

click me!