శ్రీ కృష్ణ జన్మాష్టమి: కృష్ణుడి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే..!

Published : Aug 07, 2025, 02:57 PM IST

కృష్ణుడి లీలలు మాత్రమే కాదు.. ఆయన జీవితం  నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. మరి, అవేంటో చూద్దామా… 

PREV
17
Janmashtami 2025:

శ్రీ కృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన ఈ వేడుకలు జరుపుకోనున్నారు. ఈ  విష్ణువు ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణావతారం.

కృష్ణుడి లీలలు అందరికీ నచ్చుతాయి. అయితే.. కేవలం లీలలు మాత్రమే కాదు., ఆయన నుంచి మనం మన జీవితాన్ని ఎలా గడపాలి…? ప్రేమ ఎలా పంచాలి అనే విషయాలను కూడా కచ్చితంగా నేర్చుకోవాలి. మరి, ఆయన జీవితం నుంచి కచ్చితంగా నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఏంటో చూద్దాం…

27
ప్రేమ..

రాధా పట్ల కృష్ణుడి ప్రేమను దివ్య మైన,  స్వచ్ఛమైన రూపంగా భావిస్తారు. రాధాకృష్ణులు పెళ్లి చేసుకోకపోయినా.. ప్రేమ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వీరే.  వారి బంధం ప్రపంచ అంచనాలను అధిగమించింది.

పాఠం: నిజమైన ప్రేమ అనేది స్వాధీనం కాదు, లోతైన అనుబంధం. ఇది ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమించడం నేర్పుతుంది. ఈ రోజుల్లో అందరూ  కేవలం లాభం కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు. అలాంటివారు.. శ్రీకృష్ణుడి నుంచి నిజమైన ప్రేమను  నేర్చుకోవాలి. 

37
కర్మ, ధర్మం

యుద్ధభూమిలో అర్జునుడికి మార్గనిర్దేశం చేయడం నుండి కొంటె గొల్లవాడిగా నటించడం వరకు, కృష్ణుడు అనేక పాత్రలు పోషించాడు—కానీ తన ధర్మాన్ని మాత్రం ఏనాడు వీడలేదు. 

పాఠం: జీవితం అంటే మీ విధులను నిజాయితీగా నెరవేరుస్తూ.. సత్య మార్గంలో నడవడం..

భగవద్గీత లో కూడా “ఫలితంతో సంబంధం  లేకుండా మీ కర్మను బట్టి పని చేసుకుంటూ వెళ్లిపోండి. ” అని పేర్కొన్నారు.

47
Use of Wisdom Over Power

కృష్ణుడు అరుదుగా బలప్రయోగం చేసేవాడు. బదులుగా, అతను వ్యూహం, దౌత్యం , తెలివితేటలతో యుద్ధాలను గెలిచాడు.అది కంసుడిని ఓడించడం లేదా మహాభారతంలో పాండవులకు మార్గనిర్దేశం చేయడం.

పాఠం: నిజమైన నాయకత్వం జ్ఞానాన్ని ఉపయోగించడంలో ఉంది. ప్రశాంతమైన మనస్సులు, తెలివైన పరిష్కారాలు , నైతికత మాత్రమే మిమ్మల్ని గెలిపిస్తాయి. 

57
Smile Through Every Phase of Life

ద్రోహాలు, శాపాలు, యుద్ధాలు , బాధాకరమైన సంఘటనలను ఎదుర్కొన్నప్పటికీ, కృష్ణుడు  ముఖంపై చిరునవ్వు ఎప్పుడూ చెదరలేదు.

పాఠం: జీవితంలో సమస్యలు సుఖ, సంతోషాలు వస్తూనే ఉంటాయి. కానీ.. సంతోషంలో పొంగిపోవడం, దుఖంలో కుంగిపోవడం లాంటివి చేయకూడదు. 

67
Celebrate Every Relationship

కృష్ణుడు సుదామకు స్నేహితుడు, సుభద్రకు సోదరుడు, రాధకు ప్రియుడు, అర్జునుడికి గురువు, యశోదకు కుమారుడు.

పాఠం: జీవితంలో ప్రతి సంబంధం ఒక పవిత్ర పాత్ర పోషిస్తుంది. వాటిని సమయం, గౌరవం, ప్రేమతో పెంచుకోండి.

ఈ జన్మాష్టమి నాడు, మీతో ప్రయాణించే వారిని అభినందించడానికి కొంత సమయం కేటాయించండి.

77
Live with Purpose and Playfulness

వెన్న దొంగిలించడం, వేణువు వాయించడం, గోపికలను ఆటపట్టించడం వంటి కృష్ణుడి చిన్ననాటి కథలు. జీవితం అంటే కేవలం గంభీరత మాత్రమే కాదు, ఉల్లాసమైన ఆనందం కూడా అని అవి మనకు గుర్తు చేస్తాయి.

పాఠం: జీవితాన్ని ఉల్లాసంగా స్వీకరించండి. జీవితంలో స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. సంగీతం , సరదాలు, అల్లరికి కూడా చోటు ఇవ్వాలి. 

Read more Photos on
click me!

Recommended Stories