గణేష్ చతుర్థి 2022: ఏకదంతునికి ఏకంగా 108 పేర్లే ఉన్నాయి. అందులో ఒక్కొక్క పేరుకు ఒక్కో అర్థం కూడా ఉంది. అయినప్పటికీ ఈ జ్ఞానదేవుడిని గణపతి లేదా వినాయకుడనే పిలుస్తుంటారు. బొజ్జ వినాయకుడే శాస్త్రాలకు, కళలకు అధిపతి. అందుకే పండుగలు, వేడుకలకు వినాయకుడే ముందుగా పూజలందుకుంటాడు. ఇక అసలు విషయానికొస్తే.. గణేషుడి పుట్టుకకు రెండు విభిన్న వెర్షన్లే ఉన్నాయి..
Image: Getty Images
ఒకటి: పార్వతీ దేవి స్నానం చేసే ముందు..పిండితో ఒక గణేషుడి బొమ్మను తయారుచేసి.. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కాపలాగా ఉంచుతుంది. అయితే పార్వతీ మాత స్నానం చేసే సమయంలోనే బయటకెళ్లిని పరమేశ్వరుడు వస్తాడు. కాపాలగా ఉన్న గణేషుడికి శివుడు ఎవరన్న సంగతి తెలియదు. దీంతో శివుడిని లోపలికి వెళ్లకుండా అడ్డుపడతాడు. దీంతో ఇద్దరి మధ్య భీకర యుద్దం జరుగుతుంది. దీంతో పరమేశ్వరుడికి పట్టరాని కోపం వచ్చి గణేషుడి తలను నరుకుతాడు. ఈ సమయంలోనే పార్వతి బయటకొచ్చి.. అక్కడ జరిగిన దారుణాన్ని చూసి బోరున విలపిస్తుంది. ఎలాగైనా గణేషుడిని బ్రతికించమని శివుడిని కోరుతుంది. దాంతో శివుడు ఉత్తరాభిముఖంగా వెళ్లి ఒక ఏనుగు తలను తెచ్చి.. గణేషుడికి పెట్టి తిరిగి ప్రాణం పోస్తాడు.
Image: Getty Images
రెండోది: దేవతల కోరిక మేరకు పరమేశ్వరుడు, పర్వతీమాత లు గణపతిని సృష్టించారని నమ్ముతారు. రాక్షసుల నుంచి వచ్చే అడ్డంకులను తొలగించేందుకు .. దేవతలకు సాయం చేయడానికి విఘ్నహర్తాను పుట్టించారని మరో పురాణం చెబుతోంది. విఘ్నహర్త అంటే ఇబ్బందులు అని.. హరత అంటే తొలగించేవాడని అర్థం. అందుకే గణపయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీకున్న బాధలు, సమస్యలన్నీ తొలగిపోతాయి.
ganesh chaturthi 2022
ఈ ఏడాది ఆగస్టు 31 న వినాయక చవితి వచ్చింది. ఈ పండున శుక్ల చతుర్థి నాడు ప్రారంభమవుతుంది. ఇక ఈ పండుగ సందర్భంగా వినాయక మండపాలన్నీ రంగురంగులతో శోభిల్లుతాయి. ఈ పండుగకు నాలుగు ప్రధాన ఆచారాలు ఉన్నాయి. ఒకటి ప్రాణప్రతిష్ట.. అంటే వినాయకుడికి విగ్రహాన్ని ప్రతిష్టించడం. రెండో షోడశోపచారం- గణేషుడికి నివాళులు అర్పించే 16 రూపాలు. మూడోది ఉత్తర పూజ- పూజ. నాలుగోది గణపతి విసర్జన-విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేయడం.
ఈ పండుగను మరాఠా రాజు శివాజీ కాలం నుంచి జరుపుకుంటున్నారు. అయితే ప్రజా గణేషుడి విగ్రహాన్ని భౌసాహెబ్ లక్ష్మణ్ జావలే మొదటగా ప్రతిష్టించారు. అయితే మనదేశంలో పాటుగా థాయ్ లాండ్, ఇండోనేషియా, కంబోడియా, చైనా, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ వంటి దేశాల్లో కూడా గణేషుడిని ఆరాధిస్తారు.