పురాణాల ప్రకారం.. గణేషుడి నిమజ్జనం వెనుక ఒక ఆసక్తికరమైన కథే ఉంది. ఈ పండుగ చివరి రోజు అంటే నిమజ్జనం రోజున బొజ్జ గణపయ్య కైలాసంలో ఉండే తన తల్లిదండ్రులైన శివ పార్వతుల దగ్గరకు తిరిగి వెళ్తాడట. అంటే నిమజ్జనం తర్వాత. అయితే వినాయక చతుర్థిని జరుపుకోవడం అనేది మనిషి జనన, మరణ చక్రాల ప్రాముఖ్యతను సూచిస్తుంది. వినాయకుడి నిమజ్జనం కోసం విగ్రహాన్ని బయటకు తీసినప్పుడు ఇంట్లో ఉండే ఎన్నో అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు మీకున్న కష్ట, నష్టాలు కూడా పోతాయని ప్రజలు నమ్ముతారు.