లక్ష్మీ కటాక్షం కలగాలంటే కర్పూరంతో ఇలా చేస్తే చాలు.. కర్మలన్నీ పోయినట్టే?

First Published | Oct 5, 2022, 3:02 PM IST

ప్రతి ఒక్కరూ వారి జీవితంలో సిరిసంపదలతో ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు లక్ష్మీ కటాక్షం కోసం అమ్మవారికి పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు.అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కర్పూరంతో ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది.
 

 ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించినప్పటికీ చేతిలో డబ్బు ఏ మాత్రం నిలవదు.వచ్చిన డబ్బు వచ్చిన విధంగానే నీళ్లలా ఖర్చు అవుతూ ఉంటుంది. ఇలా ఎంతోమంది ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది. ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు లక్ష్మీదేవికి కర్పూరంతో  ఇలా చేయాల్సి ఉంటుంది.
 

ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలంటూ స్నానం చేయాలి అలాగే లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఇలా పూజ చేసిన అనంతరం ఐదు కర్పూర బిల్లలను ఎర్రని వస్త్రంలో మూటకట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచాలి. ఇలా మూట కట్టిన అనంతరం ఆ మూటకు ధూపం వేసి పూజ చేయాలి.
 


 ఈ విధంగా కర్పూరం కట్టిన మూటకు లక్ష్మీదేవికి పూజ చేసిన అనంతరం ఆ మూటను తీసుకువెళ్లి మనం బీరువాలో డబ్బులు బంగారం దాచే చోట ఎవరికీ తెలియకుండా పెట్టాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం మనపై ఉండడమే కాకుండా మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడుతూ ధన కటాక్షం కలిగిస్తుంది.ఈ విధంగా కర్పూరంతో పరిహారం చేసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి కర్మ ఫలితాలు అన్ని తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
 

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఈ విధమైనటువంటి పూజ చేసి అంతా దేవునిపైనే భారం వేయకూడదు మనం న్యాయబద్ధంగా మన కష్టాన్ని కూడా నమ్ముకుని మన పనులు మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది.ఇలా సత్యమార్గంలో కాకుండా అసత్య మార్గంలో డబ్బు సంపాదించాలనుకునే వారిపై అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరింత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు తద్వారా మనం ఏ పని చేసినా సత్యమార్గాన్ని ఎంచుకొని చేయడం వల్ల అమ్మ వారి కరుణాకటాక్షాలు కూడా మనపై ఉంటాయి.

Latest Videos

click me!