Dussehra 2022 Wishes: దసరా పండుగ రోజు మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు చెప్పండి!

First Published Oct 4, 2022, 8:37 PM IST

Dussehra 2022 Wishes: దసరా హిందువులు జరుపుకొనే ముఖ్యమైన పండుగ. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఎంతో నియమనిష్టలతో పూజలు చేసి పదవ రోజు దసరాగా జరుపుకుంటారు. దసరా అంటే దశహర. దశరాత్రులు అని అర్థం. దశ పాపాలను తొలగిస్తుంది.

అలా ముందు తొమ్మిది రోజులు అమ్మవారికి నవరాత్రి పూజలుగా జరుపుకొని ప్రతిరోజు బతుకమ్మలను పెట్టి ఘనంగా జరుపుకుంటారు. ఇక పదవరోజు విజయదశమిగా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అలా దసరా సందర్బంగా కాబట్టి బంధుమిత్రులకు కొన్ని కొటేషన్స్ ద్వారా ఇలా శుభాకాంక్షలు తెలపండి. ఇంతకు ఆ కొటేషన్స్ ఏంటంటే..
 

ఈ పండుగ రోజున అందరికీ శుభాలు, ఐశ్వర్యాలు కలగాలని కోరుతూ మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.

మీరు కోరిన కోరికలు తీరాలి అంటూ.. ఆ అమ్మవారి దయ మీపై కలగాలి అని కోరుతూ విజయదశమి శుభాకాంక్షలు.
 

ఇకపై ప్రతి ఒక్కరి జీవితంలో అన్ని విజయాలు కలగాలని కోరుతూ విజయదశమి శుభాకాంక్షలు.

చల్లని అమ్మవారి ఆశీస్సులతో మీ సమస్యలన్నీ తీరిపోయి ఇకపై సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.

మీరు చేపట్టిన పనులన్నీ ఎటువంటి ఆటంకాలు  రాకుండా సక్రమంగా జరిగేలా కోరుతూదసరా శుభాకాంక్షలు.

దుర్గమ్మ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలి అని కోరుతూ దసరా పండుగ శుభాకాంక్షలు.

ప్రకృతి వైపరీత్యాలనుండి కాపాడి అందరినీ చల్లగా చూస్తున్న అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ మీపై ఉండాలి అని కోరుతూ విజయదశమి శుభాకాంక్షలు.

ఈ పండుగ రోజు పాత బంధాలతో పాటు కొత్త బంధాలను కూడా దృఢంగా ఉంచాలని కోరుతూ దసరా శుభాకాంక్షలు.
 


విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ దసరా పండుగ శుభాకాంక్షలు.

జీవితంలో చెడు చేయకుండా మంచి పనులు చేస్తూ ఉండాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు.

కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో ఈ పండుగను సంతోషంగా గడపాలని కోరుతూ విజయదశమి శుభాకాంక్షలు.

నా ప్రియమైన మిత్రులందరికీ అంతా మంచి జరగాలని కోరుతూ దసరా పండుగ శుభాకాంక్షలు.

ఆదిశక్తి అమ్మ వారందరి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు.

తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుతూ విజయదశమి శుభాకాంక్షలు.
 

ఏడవ రోజు: ఏడవ రోజు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తుంది. ఇక ఈ రోజు అమ్మవారిని పూజిస్తే సర్వమంగళకర యోగాలు దక్కుతాయి.

మహిళలను దేవతగా పూజించే ఈ భూమిపై మహిళలకు రక్షణ కావాలి అని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు.

ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ దసరా పండుగ శుభాకాంక్షలు.

click me!