Bala Ramayanam
చెడు పై మంచి గెలుపుకు నిదర్శనంగా దసరా పండగను జరుపుకుంటాం. నేడే విజయదశమి. దేశ వ్యాప్తంగా ఈ పండగను ప్రజలు సంబరంలా జరుపుకుంటారు. ఈ రోజున రావణాసురుడిపై రాముడు విజయం సాధించడని... ఆ రోజున మనం ఈ పండగను జరుపుకుంటాం. అసలు రామాయణం నుంచి మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
Bala Ramayanam
1.రామాయణం కేవలం ఒక పౌరాణికం కాదు. ఒక మనిషి ఎలా ఉండాలో రాముడు దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఒక కొడుకు ఎలా ఉండాలో కూడా రాముడు దగ్గర నేర్చుకోవచ్చు. భర్త మీద ప్రేమను సీతను చూసి నేర్చుకోవచ్చు. అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో రామలక్ష్మణుల నుంచి నేర్చుకోవచ్చు.
2.రామాయణంలో దశరథుని చూసిన తర్వాత.. గుడ్డిగా ఎవరినీ ఎలాంటి ప్రామాణాలు చేయకూడదని నేర్చుకోవచ్చు, దశరథుడు గుడ్డిగా భార్య కైకేయి మీద ప్రేమతో ప్రమాణం చేయడం వల్లనే.. రాముడు 14ఏళ్లు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. కాబట్టి.. ఎవరికైనా ప్రామిస్ చేసే ముందు కాస్త ఆలోచించి చేయాలి.
Bala Ramayanam
3.దశరథుడు తన భార్యకు ఇచ్చిన ప్రామిస్ ని పూర్తి చేయడం కోసం రాముడు అరణ్యవాసానికి వెళ్లాడు. తండ్రి చెప్పిన మాటను పూర్తిగా విన్నాడు. నేను ఎందుకు వెళ్లాలి అని ప్రశ్నించలేదు. కుటుంబానికి విలువ ఇచ్చి.. రాజ్యాన్ని వదిలేసి అడవికి వెళ్లాడు. కుటుంబానికి ఎంత విలువ ఇవ్వాలో... ఎంత ప్రేమ ఇవ్వాలో... రాముడు దగ్గర నుంచి నేర్చుకోవాలి.
4.కోపం తెచ్చుకోవడం వల్ల మనకు జీవితంలో పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. పైగా నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లక్ష్మణుడు కోపంలో.. రావణాసురుడి చెల్లెలు శూర్పనక ముక్కు , చెవులు కట్ చేయకుండా ఉండి ఉంటే... రావణాసురుడు రాముడిపై పగ తీర్చుకునేవాడే కాదు. అలా పగ పెంచుకోవడం వల్ల రావణాసురుడు జీవితంలో కోరుకున్నవి అన్నీ పోగొట్టుకుననాడు కాబట్టి... ఎప్పుడూ ఎదుటివారిపై కోపాన్ని, పగను ప్రదర్శించకూడదు.
deer
5.మనకు చాలా సార్లు చాలా వస్తువులను చూసినప్పుడు టెంప్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ... అలా టెంప్ట్ అయిన ప్రతి వస్తువు మనకు దక్కాలని అనుకోకూడదు. సీత.. బంగారు లేడిని చూసి దానిని దక్కించుకోవాలని ఆశపడకుండా ఉండి ఉంటే... ఆ తర్వాత ఆమె సమస్యల్లో పడి ఉండేది కాదు. సీత కోరిందని రాముడు బంగారు లేడి తేవడానికి వెళ్లినప్పుడే కదా.. రావణాసురుడు మాయ వేశంలో వచ్చి సీతను అపహరించుకుపోయింది.
patience
6.ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా ఉండటం ఎలాగో రాముడిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే సీతను రావణాసురుడు ఎత్తుకు వెళ్లినా.. చాలా సమస్యలు ఎదురైనా వాటిని ఓపికగా జయించాడే కానీ... సమస్య వచ్చిందని బాధపడుతూ కూర్చోలేదు. ఆ సమస్యకు పరిష్కారం మాత్రమే ఆలోచించాడు. అందుకే.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఓపికగా ఉండటం నేర్చుకోవాలి.
Ram Navami in India in 2022
7.ప్రతి ఒక్కరినీ ఎలా గౌరవించాలో రాముడిని చూసి నేర్చుకోవాలి. రాముడు దేవుడైనా ప్రతి ఒక్కరికీ గౌరవం ఇచ్చేవాడు. తనకు సహాయం చేసిన వారణ సైన్యంతో పాటు.. ఏకంగా రావణాసురుడిని సైతం రాముడు గౌరవించాడట. రావణాసురుడిని హతం చేసిన తర్వాత శాస్త్రోక్తంగా దహనం చేశాడు.
End of Satyuga- How did Lord Rama die
8.ప్రతి ఒక్కరూ దర్మాన్ని పాటించాలి అనే విషయాన్ని కూడా రాముడు దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రాముడు... ఏనాడు తన ధర్మాన్ని తప్పలేదు. తన ధర్మాన్ని పాటిస్తూనే వచ్చాడు.
9.మన జీవిత భాగస్వామిని మనం నమ్మాలి అనే విషయాన్ని మనం సీతను చూసి నేర్చుకోవచ్చు. సీత తన భర్త అమితంగా నమ్మింది.. అంతే ప్రేమించింది. అందుకే భర్త వెంట అరణ్యవాసానికి వచ్చేసింది. అంతేకానీ.. రాజ భోగాలు అనుభవించవచ్చు కదా అని అయోధ్యలో ఉండిపోలేదు. భర్త వెంట అడవులకు వెళ్లింది.
Sita was the daughter of Ravana
10. సీతను రావణాసురుడు అపహరించిన తర్వాత కూడా ఆమె తన భర్త రాముడిపై నమ్మకం పోగొట్టుకోలేదు. తన భర్త తనను ఎలాగైనా కాపాడుకుంటాడు అనే నమ్మకం ఆమెలో ఉంది.