లక్ష్మీదేవికి ఈ నైవేద్యాన్ని సమర్పిస్తే.. ఇంట్లో డబ్బే డబ్బు!

First Published | Jul 1, 2022, 4:17 PM IST

చాలామంది బాగా సంపాదిస్తున్న సంపద (Wealth) నిలవడం లేదని బాధపడుతుంటారు.
 

ఎంత ఖర్చు తగ్గించుకున్న ఏదో ఒక రూపంలో డబ్బు వృధా అవుతుందని ఆర్థికంగా నష్టపోతున్నామని దిగులు చెందుతుంటారు. అయితే ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి. కనుక సంపద వృద్ధి చెంది ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీదేవికి  ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆర్థికంగా (Financially) స్థిరపడాలని ఇంటిల్లపాది చాలా కష్టపడుతుంటారు. కానీ వారి కష్టానికి తగిన ఫలితం లభించదు. ఎందుకంటే అనుకోని రీతిలో ఏదో ఒక విధంగా డబ్బు ఎక్కువ మొత్తంలో ఖర్చు కావడంతో ఆర్థికంగా వారు స్థిరపడలేకపోతారు. దీంతో వారు నిరాశ (Disappointment) చెందుతారు. ఇలా సంపద నిలబడకుండా ఉండడానికి అనారోగ్య సమస్యలు, అనుకోని అనవసరపు ఖర్చులు.
 

Latest Videos


కనుక ఆరోగ్యంగా (Healthy) ఉండాలన్నా, సంపద నిలవాలన్నా లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి అనుగ్రహంతో (Grace) ఆరోగ్యంగా, ఆర్థికంగా స్థిరపడతారు. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. దీంతో మీరు అనుకున్న స్థాయిలో స్థిరపడతారు. ఇందుకోసం లక్ష్మీ దేవిని ఎలా పూజించాలి.. ఎటువంటి నైవేద్యం సమర్పించుకోవాలో శాస్త్రం చెబుతోంది.
 

ఇందుకోసం సోమవారం రోజున తలస్నానం చేసి సూర్యోదయం సమయంలో అంటే 6 నుంచి 7 గంటలలోపు పెరుగును చెక్క కవ్వంతో చిలికి వెన్నెను తీయాలి. పెరుగును (Yogurt) చిలకడానికి చెక్క కవ్వన్నీ మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాం. ఇలా తయారు చేసుకున్న వెన్న (Butter) పాడవ్వకుండా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి.
 

శుక్రవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకుని లక్ష్మీదేవి పూజ (Lakshmi Devi Puja) చేయాలి. ఇలా చేసే లక్ష్మీదేవి పూజలో సోమవారం చిలికి తయారుచేసుకున్న వెన్నకు పొడి చేసుకున్న పటిక బెల్లాన్ని కలిపి నైవేద్యంగా లక్ష్మీదేవికి సమర్పించాలి. పూజ అయిపోయాక ఈ నైవేద్య వెన్న ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న పిల్లలకు తినిపించాలి. ఇలా 11 వారాల పాటు చేస్తే లక్ష్మీదేవి సంతృప్తి (Satisfaction) చెందుతుంది.
 

ఫలితంగా ఆమె అనుగ్రహం మనకు కలుగుతుంది. దీంతో సంపాదించిన ధనం నిల్వ ఉంటుంది. అనవసరపు ఖర్చులు (Unnecessary expenses), అనారోగ్య సమస్యలు (Illness issues) తగ్గుతాయి. సంపాదించిన ధనం జాగ్రత్తగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు మంచి ఫలితాలను పొందగలరు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. రావలసిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది. అలాగే శుక్రవారం నియమాలను కూడా పాటించాలి.
 

శుక్రవారం రోజున గోర్లు, వెంట్రుకలను కత్తిరించుకోవడం చేయరాదు. అలాగే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇతరులకు డబ్బు ఇవ్వరాదు. అయితే హాస్పిటల్లకు, విద్యా సంస్థలకు ఈ నియమం వర్తించదు. మాసిన బట్టలను ముట్టుకోవడం, ఉతకడం చేయరాదు. ఇంట్లో ఉన్న ఆడపిల్లలను సంతోషంగా (Happy) ఉంచాలి. భక్తిశ్రద్ధలతో నియమనిష్ఠలతో లక్ష్మీదేవిని పూజించాలి. ఇలాంటి చిన్న చిన్న పనులను ఆచరిస్తూ లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు (Ashtaishwaryas) మనకు సిద్ధిస్తాయి.

click me!