ఈ రోజున కొద్దిగా జపం చేసినా, కొద్దిగా ధ్యానం చేసినా, కొద్దిగా పారాయణం చేసిన అక్షయమైనటువంటి, అనంతమైనటువంటి దివ్యమైన ఫలితాలను పొందగలరు. అందుకే ఈ రోజుకు అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది. మరి ఈరోజు పూజా విధానం, వేటిని దానం (Donate) చేస్తే విశేషమైన ఫలితాలను పొందగలమో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అక్షయ తృతీయ లక్ష్మీదేవికి (Lakshmidevi), లక్ష్మీనరసింహ స్వామికి (Lakshminarasimha Swamy) చాలా ప్రీతికరమైన రోజు. ఈ రోజు బంగారం కొని లక్ష్మీదేవికి అలంకరించి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ప్రమిదలో ఆరు వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అలాగే లక్ష్మీదేవి ప్రీతి కోసం చక్కగా అమ్మవారికి తీపి పదార్థం ఏదైనా నైవేద్యం సమర్పించాలి.
పూజలోని అక్షింతలను తల మీద వేసుకొని "ఓం కమల వాసినేయే నమః" అనే మంత్రం 21 సార్లు చదువుకుంటూ లక్ష్మీదేవిని గులాబీలతో (Roses) పూజించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం సులభంగా మనపై కలుగుతుంది. అలాగే ఈ రోజు లక్ష్మీనరసింహ స్వామికి కూడా చాలా ఇష్టమైన రోజు. సింహాచలంలో (Sinhachalam) అక్షయ తృతీయ రోజున లక్ష్మీ నరసింహ స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు.
సింహాచలంలో సాయంత్రంవేళ స్వామివారికి చందనోత్సవం జరుగుతుంది. కనుక అక్షయ తృతీయ రోజున ఎవరైనా సరే ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి ఫోటో కానీ, విగ్రహం కానీ ఉంటే చందనం (Sandalwood) బొట్టు పెడితే విశేషమైన ఫలితాలను పొందగలరు. అలాగే కృష్ణుడి (Krishna) ఫోటో కానీ, విగ్రహం కానీ ఉంటే చందనం బొట్టు పెడితే చాలా మంచిది.
అలాగే నువ్వుల నూనెను (Sesame oil) ప్రమిదలో వేసి తొమ్మిది ఒత్తులతో దీపారాధన చేసి వడపప్పు, పానకం చేసి స్వామివారికి నైవేద్యం పెట్టాలి. "ఓం నమో నరసింహాయా" అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ స్వామి వారిని పూజించాలి. అక్షయ తృతీయ సందర్భంగా ఇలా చేస్తే లక్ష్మీదేవి, లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం (Grace) మనకు కలుగుతుంది.
దీంతో ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ రోజు ఏ మంచి కార్యము చేపట్టినా అన్నింటిలోనూ విజయం ప్రాప్తిస్తుంది. అక్షయ తృతీయ రోజున ఎవరైన పేదవాళ్లకు గానీ, ఎవరికైన సరే లడ్డూలను దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు (Financial difficulties) తొలగిపోతాయి. అలాగే విసనకర్రను దానం చేస్తే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు (Ashtaishwaryas) సిద్ధిస్తాయి.
అంతేకాకుండా ఈ రోజున బట్టలు, గుమ్మడికాయ (Pumpkin), మజ్జిగ, గొడుగు (Umbrella), దానం ఇచ్చిన విశేషమైన శుభ యోగం కలుగుతుంది. జాతక దోషాలు, నవగ్రహ దోషాలతో బాధపడేవారు పాదరక్షలను దానం చేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ రోజున మామిడి పండ్లు, పానకం, గంధం దానం చేసిన విశేషమైన ఫలితాలను పొందగలరు.