మంగళ దోషం పోవాలంటే మంగళవారం నాడు ఇలా చేయండి

First Published | Oct 3, 2023, 9:54 AM IST

మన జాతకంలో అశుభ గ్రహాల ప్రభావం వల్ల జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కుజుడు, కేతువు, రాహువు, శని గ్రహాల వల్ల ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుది. ముఖ్యంగా కుజుడి వల్ల వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. మీ జాతకంలో కుజ లోపం ఉంటే మీరు కొన్ని పనులను ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు
 

సనాతన ధర్మంలో జ్యోతిషానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్యులు మన జాతకాన్ని చూసి మన భవిష్యత్తును అంచనా వేస్తారు. అయితే మన జాతకంలో అశుభ గ్రహాల ప్రభావం వల్ల జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుజుడు, రాహువు, కేతువు, శని గ్రహాలను అశుభ గ్రహాలుగా పరిగణిస్తారు. అయితే కుజుడి వల్ల వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీ జాతకంలో కుజ లోపం ఉంటే ఖచ్చితంగా నివారణ అవసరమంటున్నారు జ్యోతిష్యులు. అంగారకుడి ప్రభావాన్ని తగ్గించేందుకు మంగళవారం నాడు కొన్ని పరిహారాలు చేయాలి. మీరు మంగళ దోషంతో బాధపడుతుంటే మంగళవారం ఈ చర్యలను ఖచ్చితంగా చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

మంగళ దోషానికి పరిహారాలు

మంగళ వారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున ఆంజనేయస్వామిని పూజించడం వల్ల మంగళ దోష ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ రోజు విఘ్నేషుడిని  పూజించడం వల్ల మంగళ దోషం నుంచి ఉపశమనం లభిస్తుందట. అందుకే మంగళవారం నాడు ఉదయాన్నే స్నానం చేసి, ధ్యానం చేయండి. ఆ తర్వాత నిష్టగా, ఆచారాలతో హనుమంతుడిని పూజించండి. పూజా సమయంలో హనుమాన్ చాలీసాను  పఠించండి. 
 

Latest Videos


మంగళ దోషాన్ని పోగొట్టడానికి మంగళవారం నాడు మంగళ యంత్రాన్ని పూజ గదిలో ప్రతిష్టించండి. అలాగే మంగళదేవుడిని పూజించండి. ఇలా చేయడం వల్ల మంగళ దోష ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

శారీరకంగా దృఢంగా ఉంటే మంగళవారం నాడు హనుమంతునికి ఉపవాసం ఉండండి. అయితే మంగళవారం ఉపవాసం ఉంటే మంగళ దోష ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు కూడా.  మీరు కూడా మంగళ దోషంతో బాధపడుతుంటే మంగళవారం శ్రీ మంగళ చండికా స్తోత్రాన్ని పఠించండి. దీనివల్ల మంగళ దోషం నుంచి పూర్తిగా బయటపడతారు. 

మంగళ దేవ మంత్రం

ఓం అంగరకాయ నమః

ఓం భౌం భౌమాయ నమః"

ఓం నమో భగవతే పంచవద్నాయ పసిముఖై గరుడన

మార్స్ ప్రార్థనా మంత్రం

'ఓం ధరణిగార్భసంభూతం విద్యుకాంతసంప్రభాం.

కుమరం శక్తిహస్తం తన్ మంగళం ప్రాణమయం. '

మంగళ గాయత్రీ మంత్రం

ఓం క్షితి పుత్రాయ విదాహే లోహితంగై

ధిమహీ-తనో భూమ్: ప్రచోదయత్.. 

click me!