ఇంటి ఇల్లాలు పొద్దున్నే లేచి పాచిగుమ్మాలని తుడిచి ఇంటిని సుచిగా చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి తప్పనిసరిగా పాయసం గాని పరమాన్నం గానీ నైవేద్యంగా సమర్పించాలి. మహావిష్ణువు పాదాల దగ్గర కూర్చొని ఉండే లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
అలాగే అశోక పత్రాలని తోరణంగా చేసి ఇంటి ముఖద్వారానికి కట్టడం వలన దుష్టశక్తుల ప్రభావం, ప్రతికూలతలు తొలగిపోతాయి. ఎర్రని పట్టు వస్త్రంలో చుట్టి లాకర్లో భద్రపరిస్తే భవిష్యత్తులో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవట. గులాబీ సువాసన కలిగిన అగరవత్తులు మహాలక్ష్మికి మహా ప్రీతి.
కాబట్టి దేవుడి గదిని ఆ సువాసనలతో ఉండేలా చూసుకోండి. అలాగే లక్ష్మీదేవికి మల్లెపూలతో పూజించటం శ్రేష్టం. అలాగే శుక్రవారం రోజు తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించడం వలన ధన కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవికి సువాసనలతో కూడిన పూజలు ఇష్టపడుతుంది అందుకే మంచి గంధాన్ని పూజలో ఎక్కువగా ఉపయోగించండి.
అలాగే అష్ట రకాల నూనెతో కర్పూరంతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించటం వలన అమ్మవారి మనసు చల్లబడి ఆమె పూర్తి అనుగ్రహాం మనకి అందిస్తుంది. అలాగే శుక్రవారం నాడు ఇంట్లో ఐశ్వర్యం కలగాలంటే లక్ష్మీదేవిని రెండు మొహాల నెయ్యి దీపం వెలిగించి పూజించాలి ఇలా చేయడం వలన డబ్బు ఆదా అవుతుంది.
అలాగే శుక్రవారం నాడు ఆ ఇంటి ఇల్లాలు ఏడవటం, జుత్తు విరబూచుకొని తిరగటం అలాగే అప్పు చేయటం కానీ అప్పు ఇవ్వటం కానీ చేయకూడదు. అలాగే ఆరోజు లలితా సహస్రం, విష్ణు సహస్రం వంటి పారాయణలు చేయటం వలన అమ్మవారి కరుణకు పాత్రులు అవుతారు.