అలహాబాద్ లో ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవే!

First Published Jan 16, 2022, 3:21 PM IST

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని అతిపెద్ద నగరాలలో అలహాబాద్ (Allahabad) ఒకటి. ఈ ప్రాంతంలో అనేక సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. పూర్వం ఈ నగరాన్ని ప్రయాగ అని పిలిచేవారు. ఇది భారతదేశంలోని ప్రసిద్ధ తీర్థయాత్ర ప్రదేశంగా ప్రసిద్ధి. ఈ నగరంలో అనేక దేవాలయాలు, కోటలు, విశ్వవిద్యాలయాలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఇప్పుడు మనం అలహాబాద్ లో సందర్శనకు వీలుగా ఉన్న ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
 

1575 వ సంవత్సరంలో ఈ నగరాన్ని మొగల్ చక్రవర్తి అక్బర్ (Akbar) పరిపాలించేవాడు. అక్బర్ పరిపాలనా కాలంలో ఈ నగరాన్ని ల్లహబాస్ (Llahabas) అని పిలిచేవారు. అక్బర్ పరిపాలనా కాలం తర్వాత ఈ నగరం అలహాబాద్ గా ప్రసిద్ధి. అక్బర్ పరిపాలనా కాలంలో అలహాబాద్ కోటను నిర్మించాడు.
 

అలహాబాద్ లో ప్రధాన ఆకర్షణ దేవాలయాలుగా బడే హనుమంతుని ఆలయం, అలోపీ దేవి ఆలయం, కళ్యాణి దేవి ఆలయం (Kalyani Devi Temple), బెనిమాధవ్ ఆలయం, మనకామేశ్వర్ ఆలయం (Manakameshwar Temple), హనుమాన్ ఆలయంతో సహా అనేక ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. వీటిని సందర్శించడానికి ప్రతియేటా అనేక మంది పర్యాటకులు వస్తుంటారు.
 

సంగమం: అలహాబాద్ లోని గంగా, యమునా, సరస్వతి అనే మూడు నదులు కలిసే చోటును సంగమం (Sangamam) అని పిలుస్తారు. ఈ సంగమం త్రివేణి సంగమంగా ప్రసిద్ధి. ఈ సంగమంలో స్నానం ఆచరించిన సర్వ పాపాలు (All sins) తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ప్రదేశం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాకు ప్రసిద్ధి. ఈ కుంభమేళాను తిలకించడానికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు.
 

అలహాబాద్ కోట: అలహాబాద్ లో ప్రధాన ఆకర్షణగా అలహాబాద్ కోట (Allahabad Fort) ఉంది. మొగల్ చక్రవర్తి అక్బర్ 1583 లో అలహాబాద్ కోటను నిర్మించాడు. ఈ కోట మూడు నదులు కలిసే త్రివేణి సంగమం (Triveni sangamam) వద్ద ఉంది. ఈ కోట అందమైన రూపకల్పనకు, నిర్మాణానికి, నైపుణ్యానికి ప్రసిద్ధి. ఈ కోటలో అక్షయవటమనే మరణం లేని చెట్టు ఉందని చెబుతారు. అయితే ఈ చెట్టు కోటలోని నిషేధించబడిన ప్రాంతంలో ఉంది.
 

పాతల్పూరి ఆలయం: భారతదేశంలోని అతి పురాతన ఆలయం అలహాబాద్ లోని  పాతల్పూరి ఆలయం (Patalpuri Temple) ఉంది. ఈ భూగర్భ ఆలయం అలహాబాద్ కోటలో నిర్మించబడింది. ఈ ఆలయం త్రివేణి సంగమానికి దగ్గరలో ఉంది. శ్రీరాముడు (Lord Rama) ఈ ప్రాంతాన్ని సందర్శించాడని పురాణకథనం. ఈ ఆలయ సందర్శన మీకు తప్పక నచ్చుతుంది.
 

అక్షయవట్: అక్షయవట్ (Akshayavat) అనే ఈ పవిత్రమైన చెట్టు అలహాబాద్ కోట వద్ద పాతల్పూరి ఆలయానికి సమీపంలో ఉంది. ఈ చెట్టు నాశనం ఈ చేయలేని మర్రి చెట్టుగా ప్రసిద్ధి. ఒక యోగి దైవికమైన శక్తిని నారాయణ ప్రభువుని చూపించమని అడిగినప్పుడు, ఆ దేవుడు వెనువెంటనే ప్రపంచంలో నీటిని ప్రవహింపజేసి వెంటనే ఆ నీటిని అదృశ్యం (Disappear) చేశాడని పురాణకథనం. అయితే వరదల సమీపంలో ప్రతిదీ నీటిలో మునిగిపోగా కేవలం అక్షయవట్ చెట్టు మాత్రమే పైకి కనిపిస్తుంది. అందుకే ఈ మర్రిచెట్టు మరణం లేని చెట్టుగా ప్రసిద్ధి.

click me!