Spiritual: ఏ రాశి వారు ఏ గణేశుడి రూపాన్ని పూజించాలి.. విజయం కోసం ఈ విధంగా పూజించండి!

First Published | Sep 8, 2023, 12:37 PM IST

 Spiritual: విఘ్నాలు తొలగించే వినాయకుడికి అనేక రూపాలు ఉంటాయి. అయితే ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విశిష్టత. ఏ రూపంలో ఉన్న వినాయకుడిని ఏ రాశి వారు పూజిస్తే విజయం చేకూరుతుందో ఇక్కడ తెలుసుకుందాం!
 

 ఏ పూజ ప్రారంభించడానికి అయినా ముందు మనం వినాయకుడిని ప్రార్థిస్తాము. అలా చేయడం వలన వినాయకుడు సంతృప్తి చెంది మనం చేసే పనికి  విఘ్నాలు లేకుండా కాపాడుతూ ఉంటాడు. అలాంటి వినాయకుడికి అనేక రూపాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశి వారు ఏ రూపు వినాయకుడిని పూజించాలో వివరించింది.
 

మేష రాశి వారు వక్రతుండ గణేశుని విగ్రహాన్ని ఎంచుకోవాలి. ప్రసాదంగా మోతిచూర్ లడ్డూలను అందించాలి. అలాగే గణేశుడి విగ్రహాన్ని ఎరుపు రంగులో ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వలన ఆ రాశి వారికి పోరాటం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. అలాగే వృషభ రాశి వారు నీలిరంగు గణేశుడిని తెల్ల వస్త్రాలతో అలంకరించి ప్రతిష్టించాలి. ఈ వినాయకుడికి కొబ్బరి లడ్డూలని ప్రసాదంగా సమర్పించాలి.
 


 అలాగే మిధున రాశి వారు ఆకుపచ్చని బట్టలు ధరించిన వినాయకుడిని పూజించాలి. ప్రసాదంగా తమలపాకులు, పండ్లు సమర్పించండి. అలాగే కర్కాటక రాశి వారు తెల్లటి రంగులో ఉన్న గణేశుడిని గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించి పూజించాలి.
 

వీరు వినాయకుడికి  పాలతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక సింహ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించిన ఎరుపు రంగు గణేశుడు విగ్రహాన్ని పూజించడం వలన మంచి జరుగుతుంది. వీరు బెల్లంతో చేసిన ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించాలి. అలాగే కన్య రాశి వారు ఆకుపచ్చ రంగు గణేశుడు విగ్రహాన్ని తీసుకొని ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించి పూజించండి. ఈ రాశి వారు భగవంతునికి ఎండు ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా సమర్పించవచ్చు.
 

అలాగే తులా రాశి వారు తెలుపు లేదా నీలం రంగు వినాయకుడిని ఆరాధించాలి. అలాగే అరటి పండ్లు, తెల్ల రంగు పువ్వులు, లడ్డులు సమర్పించాలి. అలాగే వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు గణేశుడిని ప్రతిష్టించి, ఎరుపు రంగు పువ్వులతో పూజించాలి. వీరు ఖర్జూరాలు దానిమ్మపళ్ళని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ధనుస్సు రాశి వారు పసుపు రంగులో ఉండే విగ్రహాన్ని పూజించి, సెనగపిండి లడ్డూలు నైవేద్యం సమర్పించాలి.
 

మకర రాశి వారు నీలిరంగు వినాయకుడిని పూజించాలి. వీరు డ్రై ఫ్రూట్స్ ని ప్రసాదంగా ఎంచుకోవచ్చు. అలాగే కుంభ రాశి వారు కూడా నీలిరంగు వినాయకుడిని పూజించి బెల్లం లడ్డూలని నైవేద్యంగా సమర్పించాలి. మీన రాశి వారు ముదురు పసుపు రంగులో ఉన్న గణేశుడిని పూజించాలి. పసుపు రంగు స్వీట్లు దేవునికి సమర్పించాలి అంటే శనగపిండి లడ్డు, అరటిపండు వంటివి. ఇలా చేయడం వలన ఆయా రాశుల వారికి శుభం జరుగుతుందని జ్యోతిష్యం చెప్పబడింది.

Latest Videos

click me!