అరచేతిలో దురద వస్తుంది అంటే అర్థమేంటి..?
ఆ వ్యక్తి మీ జీవితంలో ఎక్కువ మార్పులు తీసుకువస్తారని నమ్మకమట.
ఆ వ్యక్తి మీ జీవితంలో ఎక్కువ మార్పులు తీసుకువస్తారని నమ్మకమట.
చాలా మందికి అరచేతిలో దురద వస్తుంది అంటే చాలా మంది డబ్బు ఖర్చుు అవుతుందని ఇలా ఏవేవో అనుకుంటూ ఉంటారు. కొందరు అసలు వాటిని పట్టించుకోరు. కానీ కుడి చెయ్యి కానీ, ఎడమ చెయ్యి కానీ అర చేతిలో దురద వచ్చింది అంటే కొన్ని సంకేతాలు ఉంటాయట. అవి ఏంటో తెలుసుకుందాం.
1.కుడి చెయ్యి అరచెయ్యి దురదగా వస్తుంది అంటే ఏదో మంచి జరుగుతుందని అర్థమట. అంతేకాకుండా, డబ్బులు కూడా వస్తాయని అర్థమట. అలా జరగడం చాలా మంచిదని నమ్ముతారు.
2.మరి కొంతమంది నమ్మేదాని ప్రకారం, అరచేతిలో దురద వచ్చింది అంటే ఎవరో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకుంటారని అర్థం. ఆ వ్యక్తి మీ జీవితంలో ఎక్కువ మార్పులు తీసుకువస్తారని నమ్మకమట.
3.మరి కొంత మంది నమ్మేదాని ప్రకారం, అరచేతిలో దురద వచ్చింది అంటే, సడెన్ గా డబ్బులు వస్తాయని అర్థమట. అలా కాకుండా, ఎడమ చెయ్యి దురద వస్తుంది అంటే ఏదైనా ఆర్థికంగా నష్టపోతారని అర్థమట. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలని అర్థమట.
4.కొందరైతే, కుడి చెయ్యి కానీ, ఎడమ చెయ్యి కానీ దురద వచ్చింది అంటే, ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నమ్ముతుంటారట.
5.మరి కొందరు అరచేతికి దురద వస్తే, ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నారని అర్థమట. నిజంగానే అలా అతిథులు వచ్చిన సందర్భాలు ఉన్నాయని చాలా మంది నమ్ముతుంటారు.