చనిపోయిన వ్యక్తులు తమకు సంబంధించిన వారికి అప్పుడప్పుడు కలలో కనిపిస్తూ ఉంటారు. ఇది చాలా సహజం. మనవాళ్లు చనిపోయిన తర్వాత కలలో కనిపిస్తే చాలా మంది కంగారుపడుతుంటారు. కానీ వారు కలలోకి రావచ్చట. అలా రావడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ.. వాళ్లు వచ్చినప్పుడు.. కలలో ఏడుస్తూ మాత్రం కనపడకూడదట. చనిపోయిన వాళ్లు కలలోకి వచ్చి.. ఏడిస్తే దాని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా చనిపోయినవాళ్ళు కలలో నవ్వుతూ ఉంటే ఒక అర్థం, బాధగా ఉంటే ఒక అర్థం. అనారోగ్యంగా ఉంటే ఒక అర్థం. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఏడుస్తున్నట్లు మాత్రం కల రాకూడదట. వారు ఏడుస్తూ మనకు కలలో కనిపిస్తే చాలా అనర్థాలు వచ్చే అవకాశం ఉందట.
కలలో ఏడుస్తున్నట్లు కనిపిస్తే మీ తప్పు ఉందని అర్థం..
చనిపోయిన వ్యక్తులు కలలో బాధగా ఉంటే లేదా ఏడుస్తున్నట్లు కనిపిస్తే, మీ వైపు నుంచి ఏదో తప్పు జరిగింది అని అర్థం. వాళ్ళ ఏదో ఒక కోరికను మీరు తీర్చడం లేదు అని కూడా అర్థం. ఆ కోరిక తీరేవరకూ వాళ్ళు కలలోకి వచ్చి ఏడుస్తూ ఉంటారట. మీ నమ్మకస్తుడైన జ్యోతిష్యుడిని సంప్రదించి పరిష్కారం చూసుకోవడం మంచిది.
పదే పదే ఏడుస్తున్నట్లు కల వస్తే సమస్యలు రాబోతున్నాయని సూచన..
పదే పదే వాళ్ళు కలలో ఏడుస్తుంటే, అది మీ జీవితంపై ప్రభావం చూపుతుంది అంటారు జ్యోతిష్యులు. చనిపోయిన వ్యక్తులు కలలో బాధగా కనిపిస్తే వాళ్ళకి ఏదో అసంతృప్తిగా ఉంది అని అర్థం. పదే పదే ఏడుస్తున్నట్లు కల వస్తే, మీ జీవితంలో కొన్ని సమస్యలు రాబోతున్నాయని సూచన.
కలల గురించి ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి
ఇలాంటి కలలు వచ్చినప్పుడు, దానికి కారణం ఏంటో అర్థం చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళతో ఈ కలల గురించి మాట్లాడాలి. వాళ్ళకి ఏదైనా నెరవేరని కోరిక ఉంటే, దాన్ని తీర్చడానికి ప్రయత్నించాలి. లేకపోతే అది మీ జీవితంలో సమస్యలకు దారితీయవచ్చు.
కలలో నవ్వుతూ ఉంటే ప్రశాంతంగా ఉన్నారని అర్థం....
ఏడవడం అయిపోయింది, మీ దగ్గరవాళ్ళు కలలో నవ్వుతూ లేదా సంతోషంగా ఉంటే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు అని అర్థం. మీరు చేసిన పనులతో వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు అని అర్థం.