ధంతేరాస్ రోజున ఈ మూడు కొంటే అదృష్టమే..!

First Published Oct 26, 2024, 1:35 PM IST

ఏది కొన్నా, కొనకపోయినా కేవలం మూడు వస్తువులు కొంటే మాత్రం.. కచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగడమే కాదు.. అదృష్టం కూడా కలుగుతుందట. మరి, అవేంటో చూద్దాం…

దీపావళి పండగను దాదాపు ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండగ ధంతేరాస్ తో మొదలౌతుంది. ఈ ధంతేరాస్ రోజున చాలా మంది లక్ష్మీదేవికి పూజ చేస్తారు. అంతేకాదు.. ఈ రోజున బంగారం, వెండి లాంటివి కొనుగోలు చేస్తే.. లక్ష్మీదేవి ఇంట అడుగుపెడుతుంది అని నమ్ముతారు. అయితే.. ఏది కొన్నా, కొనకపోయినా కేవలం మూడు వస్తువులు కొంటే మాత్రం.. కచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగడమే కాదు.. అదృష్టం కూడా కలుగుతుందట. మరి, అవేంటో చూద్దాం…

ధంతేారాస్ రోజున బంగారం, వెండి కాదు.. ఏది కొన్నా కొనకపోయినా…కచ్చితంగా కొత్త చీపురు మాత్రం కొనాలట. హిందూ శాస్త్రం ప్రకారం.. చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారట. అందుకే… ఈ రోజున చీపురు కొనుగోలు చేస్తే.. కచ్చితంగా అదృష్టం తలుపుకొడుతుందట. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతుంది.

Latest Videos


ఉప్పు, ధనియాలు..

మీరు చదివింది నిజమే.. ఈ ధంతేరాస్ రోజున  చీపురు కాకుండా,  ఉప్పు, ధనియాలు లాంటివి కూడా కొనుగోలు చేయాలట. ఈ రెండూ కనుక ధంతేరాస్ రోజున  కొనుగోలు చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు. డబ్బు, ఇంట్లో ధాన్యం, సరుకులు లాంటివి ఏవీ లోటు లేకుండా ఉంటాయి. ఇంట్లో నిత్యం సిరి సంపదలు లభిస్తాయట.

అంతేకాదు.. ఈరోజున ఉప్పు, ధనియాలు కొనుగోలు చేయడం వల్ల.. సదరు వ్యక్తి మంచి జరుగుతుంది. అదృష్టం లభిస్తుంది. అదేవిధంగా కుబేేరుడి ఆశీస్సులు లభిస్తాయట. కుబేరుడి ఆశీస్సులు లభిస్తే.. ఇంట సంపదకు కొదవ ఉండదు.

అంతేకాదు.. ఈ ధంతేరాస్ రోజున ఇత్తడి వస్తువులు, ఇత్తడి పాత్రలు లాంటివి ఏమి కొనుగోలు చేసినా  కూడా అదృష్టం లభిస్తుందట. ఇత్తడి వస్తువులు కొనడం వల్ల కలిగే మంచి.. 13 రెట్లు ఎక్కువగానే ఉంటుందట. అంతేకాదు కోరుకున్న సంతోషం కూడా లభిస్తుంది.

click me!