హాసనాంబ ఆలయ చరిత్ర 12వ శతాబ్దం నాటిది. హోయసల రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. హాసన్ పట్టణానికి ఈ ఆలయంతోనే పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారు అగ్ని రూపంలో ఉంటుందని నమ్మకం. ఈ ఆలయానికి వెళ్లాలంటే హసన్ పట్టణం వరకు రైలు, బస్సు, రోడ్ ద్వారా చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. హాసనాంబ దేవతకు లడ్డూ, కడలె ప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆలయం వద్ద మంత్రోచ్ఛారణ, స్మరణ, మంత్రజపం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా ఆలయం తెరచి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు పది రోజులపాటు జరుగుతాయి. ఈ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ సంవత్సరం 24 గంటలూ హాసనంబ దేవి దర్శనం చేసుకోవచ్చు. ఆ విధంగా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భక్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్శనం చేసుకోవచ్చు.
హాసన్ పట్టణానికి అధిష్టాన దేవత అయిన హాసనంబ దేవి ఉత్సవాలు అక్టోబర్ 24 నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి నవంబర్ 3 వరకు జరుగుతాయి. ఈ పది రోజుల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చు. మళ్లీ ఆలయం వచ్చే ఏడాది దీపావళి వరకు మూసి వేస్తారు.