ఇక.. ఈ వయసులో.. వర్క్ లాంటివి ఉండవు కాబట్టి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో కనెక్షన్ ఎక్కువగా పెంచుకోవాలి. వారితో సరదాగా మాట్లాడటం, అప్పుడప్పుడు కలవడం లాంటివి చేయాలి.
అంతేకాదు.. వయసు 60 దాటిన తర్వాత.. అనారోగ్య సమస్యలు రావడం మొదలౌతాయి. కాబట్టి రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. దాని వల్ల.. ఎలాంటి సమస్యలు ఉన్నాయో.. ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలుస్తుంది.
ఏ వయసులో అయినా ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి నిద్ర చాలా అవసరం. కాబట్టి మీరు కూడా 6 నుంచి 9 గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి. అప్పుడు.. మరింత కాలం ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు.