జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తారు. దాని కోసం తమ శ్రమంతా దారిపోసి కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడే వ్యక్తికి కుటుంబం కూడా తోడు అయితే మరింత తొందరగా.. విజయాన్ని చేరుకుంటారు. వారి సమస్యలను కూడా సులభంగా ఎదుర్కొంటారు.
చాణక్య నీతి ప్రకారం.. ఒక కుటుంబం ఎలా ఉండాలి..? కుటుంబంలో పెద్ద ఎలా ఉండాలి..?ఎలా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం... ఒక కుటుంబం సంతోషంగా ఉండాలన్నా.. ఆర్థికంగా ఎదగాలన్నా... అది ఆ ఇంటి పరువుపైనే ఆధారపడి ఉంటుందంట. అదేవిధంగా ఇంట్లోని సభ్యులంతా శాంతియుతంగా ఉండాలట. అంతేకాదు.. ఇంటి యజమాని కూడా సరిగా ఉ:డాలి. ఇటి పెద్దకు మంచి లక్షణాలు ఉన్నప్పుడే... ఆ కుటుంబం ఆనందంగా , సంతోషంగా ఉంటుందంట.