పురాణాల ప్రకారం.. ఆరోజున దంపతులు కలిస్తే.. ఎలాంటి పిల్లలు పుడతారో తెలుసా?

First Published Jun 17, 2024, 2:47 PM IST

పెళ్లి తర్వాత.. జరిగే కార్యక్రమాలకు సైతం శుభ గడియలు చూస్తారు. లేదంటే... పుట్టే పిల్లలు సరిగా పుట్టరు అని నమ్ముతారు. దుర్ముహుర్తంలో దంపతులు శారీరకంగా కలిస్తే.. ఎలాంటి పిల్లలు పుడతారో తెలుసా..?

మన హిందూ సంప్రదాయం, పురాణాల ప్రకారం.. మన పెద్దలు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ శుభకార్యం అయినా.. మంచి ముహూర్తంలోనే జరగాలి అని అనుకుంటారు. పెళ్లి తర్వాత.. జరిగే కార్యక్రమాలకు సైతం శుభ గడియలు చూస్తారు. లేదంటే... పుట్టే పిల్లలు సరిగా పుట్టరు అని నమ్ముతారు. దుర్ముహుర్తంలో దంపతులు శారీరకంగా కలిస్తే.. ఎలాంటి పిల్లలు పుడతారో తెలుసా..? దీని గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం..

బ్రహ్మ వైవర్త పురాణంలో.. ప్రతి స్త్రీ, పురుషులు పాటించవలసిన కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను పాటించడం వల్ల జీవితంలో సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయి. అదే నియమాలను సరిగా పాటించకపోతే.. నష్టాలు కూడా వస్తాయి. అందుకే.. మనం ఏ రోజున ఏ పని చేయకూడదో తెలుసుకొని ఉండాలి.
 

muslim couple

హిందూ క్యాలెండర్ ప్రకారం.. అమావాస్య, పూర్ణిమ, చతుర్దశి , అష్టమి చాలా ముఖ్యమైన రోజులుగా పరిగణిస్తారు. ఈ తేదీలన్నీ ప్రతి నెలా వస్తాయి. ఈ రోజున స్త్రీ, పురుషులిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఆయిల్ మసాజ్ కూడా చేయకూడదు. అంతేకాకుండా స్వచ్ఛమైన శాఖాహారం తీసుకోవాలి. ముఖ్యంగా దంపతులు ఈ రోజుల్లో శారీరక కలయికకు దూరంగా ఉండాలి. ఆరోజుల్లో కలయిక దంపతులకు నష్టాన్ని తెస్తుంది.

couple goal

అంతేకాదు... కలయిక అనేది రాత్రిపూట మాత్రమే జరగాలి. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం.. దంపతులు పగటిపూట, సాయంత్రం వేళ శారీరక కలయికకు దూరంగా ఉండాలి. ఎందుకంటే.. ఇలా చేయడం వల్ల... మహాలక్ష్మీ దేవికి కోపం వస్తుందట.  దాని వల్ల  స్త్రీ, పురుషులకు ఆర్థికంగా నష్టం కలగడంతో పాటు... కళ్లు, చెవులకు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టే పిల్లలు కూడా సరిగా ఉండరట.

బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం స్త్రీలు తమ భర్తలను బాగా చూసుకోవాలి. అదే సమయంలో, వారికి కూడా మంచి గౌరవం దక్కాలట. స్త్రీలు తమ భర్తలను గౌరవించకపోతే, మానసికంగా వేధిస్తే జంతువులు, పక్షుల లక్షణాలు ఉన్న పిల్లలు పుడతారట.  పురుషులు ఎప్పుడూ ఇతర స్త్రీలను చిన్నచూపు చూడకూడదు. అలాగే భార్యను అవమానిస్తే ఆ వ్యక్తి జీవితంలో పేదరికం లో మగ్గిపోతుందట,. దీంతోపాటు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Latest Videos

click me!