హిందూ మతంలో తులసిని ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. అలాగే ప్రతిరోజూ పూజిస్తారు. తులసి మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. అలాగే దీనిలో ఎన్నో ఔషదగుణాలు కూడా ఉన్నాయి. అందుకే దీన్ని ఏండ్ల కాలం నుంచి ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారు. తులసి మొక్క ఆకులు, విత్తనాలు, వేర్లు అన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తులసి ఆకుల మహిమను ఎన్నో శాస్త్రాల్లో కూడావర్ణించారు. అంటే తులసి ఆకు కూడా శ్రాద్ధ యజ్ఞానికి సమానమైన సద్గుణాన్ని ఇస్తుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండటానికి తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేయాలని పురాణాలు చెబుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ధన సమస్యకు పరిష్కారం
తులసి మంజరిని తీసుకుని ఎర్రటి గుడ్డలో కట్టండి. దీన్ని మీరు డబ్బును దాచే ప్లేస్ లో పెట్టండి. దీనివల్ల మీ వాల్ట్ ఎప్పటికీ ఖాళీగా ఉండదు. అలాగే డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే మంజరిని మీ పర్సులో కూడా పెట్టుకోండి. దీనివల్ల మీకున్నఅన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
శుక్రవారం నివారణ
శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజు అమ్మవారిని పూజిస్తారు. అయితే లక్ష్మీదేవికి ఈ రోజు పూజలో మంజరిని సమర్పించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అలాగే ఆమె అనుగ్రహం మీపై ఉంటుంది. దీంతో మీ సంపద పెరుగుతుంది.
Vastu Plants
నెగెటివ్ ఎనర్జీ
ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. మీ ఇంట్లో నెగిటీవ్ ఎనర్జీ పోవాలంటే ఇంట్లో మంజరిని కలిపిన నీటిని మీ ఇంటి మూలాల్లో చల్లండి. దీనివల్ల మీ ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అలాగే ఇంట్లో వాతావరణం ఆనందంగా ఉంటుంది.
వివాహానికి పరిహారాలు
మీ వివాహంలో సమస్యలను ఎదుర్కొంటుంటే.. తులసి మంజరిని పాలలో కలిపి శివలింగానికి సమర్పించండి. ఈ పరిహారం వల్ల మీ వైవాహిక జీవితంలోని అన్ని అడ్డంకులు, సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు పెళ్లికాని వారికి పెళ్లి తొందరగా కుదిరే అవకాశం ఉంది.