ఆచార్య చాణక్యుడికి పరిచయం అవసరం లేదు. ఆయన మానవ జీవితం, మానవ సంబంధాల గురించి వివరించారు. అంతేకాదు..జీవితంలో విజయం సాధించాలి అంటే.. ఏం చేయాలో.. చాణక్యుడు తన చాణక్య నీతిలో వివరించారు. మరి, చాణక్యుడి ప్రకారం.. ఎలాంటి అలవాట్లు మనిషిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
25
ఆర్థిక అలవాట్లు..
డబ్బు చాలా మందికి ఉంటుంది. కానీ, అందరి దగ్గరా ఆ డబ్బు శాశ్వతంగా నిలపడదు. దానికి కారణం వారు చేసే కొన్ని తప్పులే. ముఖ్యంగా కొన్ని అలవాట్లు ఉంటే.. ఎంత ధనవంతులు అయినా ఆర్థికంగా దెబ్బతినాల్సి వస్తుందని చాణక్యుడు చెబుతున్నాడు. ముఖ్యంగా మూడు అలవాట్లు అస్సలు ఉండకూడదు.
35
సోమరితనం అతి పెద్ద శత్రువు..
సోమరితనం మనిషికి పెద్ద శత్రువు అని చాణక్య అన్నారు. పనిని వాయిదా వేయడం, అవకాశాలు కోల్పోవడం, సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే… సోమరితనం ఉండకూడదు. ఏ పనిని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. వాయిదా వేయకూడదు.
ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసేవాడు ఎప్పుడూ అప్పుల్లో ఉంటాడని చాణక్య అన్నారు. ఖర్చు చేసే ముందు దాని ఉపయోగం, దీర్ఘకాలిక ప్రభావం గురించి ఆలోచించాలి. మన స్థోమతకు మించిన ఖర్చులు ఎప్పుడూ చేయకూడదని, ముఖ్యంగా అప్పులు అస్సలు చేయకూడదని చాణక్యుడు చెబుతున్నాడు.
55
క్రమశిక్షణ లేకపోవడం..
ఇంట్లో సమయపాలన, నియమాలు, బాధ్యతలు పాటించకపోతే ఆర్థిక స్థిరత్వం ఉండదు. క్రమశిక్షణ లేని జీవనశైలి ఆదాయాన్ని తగ్గించడమే కాకుండా, పొదుపు, పెట్టుబడుల అలవాట్లను నాశనం చేస్తుంది.