అగర్బత్తీలు ఎక్కువగా వెలిగిస్తున్నారా? అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి!

Published : Jul 30, 2025, 04:31 PM IST

సాధారణంగా మనం దేవుడికి పూజ చేసేటప్పుడు అగర్బత్తులను వెలిగిస్తాం. అగర్బత్తి లేకుండా పూజ కంప్లీట్ అయినట్లు అనిపించదు. అయితే అగర్బత్తులు ఎక్కువగా వాడటం అస్సలు మంచిది కాదట. వాటి పొగ హానికరమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకో ఇక్కడ చూద్దాం.  

PREV
16
అగర్బత్తి పొగ ప్రమాదకరమా?

ఇళ్లు, ఆలయాలు, ధ్యాన గదులు ఇలా ప్రతిచోటా సువాసనతో కూడిన ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడానికి అగర్బత్తులని వెలిగిస్తారు. కానీ అగర్బత్తి నుంచి వెలువడే పొగ సిగరెట్ పొగ కంటే ప్రమాదకరమని అధ్యయనాలు చెబుతున్నాయి. సౌత్ చైనా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అగర్బత్తి పొగపై అధ్యయనం చేసింది. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది.

26
అగర్బత్తి పొగ వల్ల వచ్చే సమస్యలు

సౌత్ చైనా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకుల బృందం అగర్బత్తి పొగపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం "Particulate matter emission and characterization from the burning of incense" అనే శీర్షికతో ప్రచురించబడింది. అగర్బత్తి పొగలో సిగరెట్ పొగ మాదిరిగానే వివిధ రకాల విషపూరిత, చికాకు కలిగించే సమ్మేళనాలు ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.

అగర్బత్తి పొగ నుంచి వెలువడే సూక్ష్మ కణాలు (Particulate Matter - PM2.5, PM10) ఊపిరితిత్తుల్లోకి లోతుగా వెళ్లి శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయని కనుగొన్నారు. 

అగర్బత్తి కార్బన్ మోనాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఇది రక్తంలో కలిసినప్పుడు ఆక్సిజన్ స్థాయి తగ్గి తలనొప్పి, వికారం, కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

36
క్యాన్సర్ ప్రమాదం

అగర్బత్తి పొగ నుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్ శ్వాసకోశ సమస్యలను, నైట్రోజన్ డయాక్సైడ్ తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. ఈ పొగ నుంచి వెలువడే ఫార్మాల్డిహైడ్, అసిటాల్డిహైడ్ వంటి సమ్మేళనాలు క్యాన్సర్ రావడానికి కారణం అవుతాయి. 

46
అగర్బత్తి పొగ ఎందుకు ప్రమాదకరం?

సిగరెట్ పొగ లాగే అగర్బత్తి పొగ కూడా ఊపిరితిత్తుల వాపు, శ్వాసనాళాల చికాకును కలిగిస్తుంది. ఎక్కువ కాలం ఈ పొగ పీల్చిన వారిలో ఆస్తమా, దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం సూచించింది. 

ఈ అధ్యయనం ప్రకారం అగర్బత్తి పొగలోని కొన్ని సమ్మేళనాల స్థాయి కొన్నిసార్లు సిగరెట్ పొగ కంటే ఎక్కువగా లేదా సమానంగా ఉండవచ్చు. ముఖ్యంగా మూసి ఉన్న గదుల్లో అగర్బత్తి వెలిగించినప్పుడు సూక్ష్మ కణాలు, క్యాన్సర్ కారక రసాయనాల సాంద్రత ఎక్కువగా ఉంటుంది.  

56
అగర్బత్తిని సురక్షితంగా ఉపయోగించే పద్ధతులు

అగర్బత్తి వెలిగించేటప్పుడు తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. గాలి ప్రసరణను నిర్థారించుకోవాలి. చిన్న, గాలి ప్రసరణ లేని గదుల్లో ఎక్కువసేపు అగర్బత్తి వెలిగించడం మానుకోవాలి. నాణ్యమైన సహజ పదార్థాలతో తయారు చేసిన అగర్బత్తులను ఎంచుకోవాలి. ఎక్కువ సువాసనలు, కృత్రిమ సువాసనలు, కృత్రిమ రంగులు, రసాయనాలు కలిసినవి ఆరోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తాయి.

66
ఇది గుర్తుంచుకోండి!

ఒకేసారి చాలా అగర్బత్తులను వెలిగించడం మానుకోవాలి. సాధ్యమైతే సుగంధ నూనెలను ఉపయోగించి సువాసనను సృష్టించవచ్చు. అగర్బత్తి వాడకాన్ని పూర్తిగా మానలేకపోయినా, దాని ప్రమాదకర ప్రభావాల గురించి అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. సురక్షితమైన పద్ధతులను పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories