Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి బంధువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!

Published : Mar 21, 2025, 03:22 PM IST

ఆచార్య చాణక్యుడి బోధనల ప్రకారం కొంతమంది బంధువులకు దూరంగా ఉండటం చాలా మంచిదట. వారి వల్ల మంచి జరగకపోగా.. చెడు జరిగే ప్రమాదం ఉందట. మరి ఎలాంటి వారికి దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకందాం.  

PREV
18
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి బంధువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!

సాధారణంగా బంధువులు, స్నేహితులతోనే మనం ఎక్కువగా కలిసి ఉంటాం. అన్ని విషయాలు పంచుకుంటాం. కానీ బంధువులు, స్నేహితులు ఎప్పుడూ మన మంచి కోరే వారే కాకపోవచ్చు. లోపల కుళ్లు పెట్టుకొని పైకి బాగా మాట్లాడేవారు కూడా లేకపోలేదు. చాణక్యుడి నీతి ప్రకారం అలాంటి వారిని ఎలా గుర్తించాలి? ఎలాంటి బంధువులకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

28
హాని చేసే బంధువులు

చాలామంది బంధువులు, స్నేహితులు పైకి బాగానే మాట్లాడుతారు. కానీ లోపల ఇంకో భావన పెట్టుకొని ఉంటారు. అలాంటి వారిని గుర్తించడం చాలా కష్టం. ఏదైనా పెద్ద నష్టం జరిగిన తర్వాతే వాళ్ల నిజస్వరూపం మనకు తెలుస్తుంటుంది. చాణక్య నీతి ప్రకారం అలాంటి వాళ్లను ముందుగానే ఎలా గుర్తించాలో ఇక్కడ చూద్దాం.

38
నెగెటివ్ ప్రభావం

కొంతమంది బంధువులు లేదా స్నేహితులతో మాట్లాడితే నెగెటివ్ ఆలోచనలు వస్తాయి. నిరాశ కలుగుతుంది. ఇలాంటి వాళ్లను ఈజీగానే గుర్తించవచ్చు. చాణక్యుడి ప్రకారం వాళ్లతో సంబంధం పెట్టుకోకపోవడమే మంచిది.

48
అలాంటి వారిని నమ్మకూడదు

బంధువుల్లో చాలామంది సహాయం చేస్తారు. కానీ కొంతమంది నష్టం కలిగిస్తారు. లేదా మోసం చేస్తారు. హాని చేసే వాళ్లకు దూరంగా ఉండాలి. ఒకసారి మోసం జరిగితే వారిని తిరిగి నమ్మకూడదు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చాణక్య నీతిలో పేర్కొనబడింది.

58
గొడవలు పెట్టే బంధువులకు..

సాధారణంగా బంధువులు ఒకరి ఇంటికి ఒకరు వెళ్తుంటారు. అయితే కొంతమంది బంధువులు ఇంటికి వస్తే మాత్రం నష్టం జరుగుతుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తుంటాయి. చాణక్య నీతి ప్రకారం అలాంటి వాళ్లకు దూరంగా ఉండాలి.

68
కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని బంధువులు

కొంతమంది బంధువులు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయరు. ఆ సమయంలో కూడా నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తారు. దాన్ని అవకాశంగా తీసుకుంటారు. ఇలాంటి వాళ్లతో సంబంధం పెట్టుకోకపోవడమే మంచిదని చాణక్యుడు బోధించాడు.

78
ఎప్పుడూ విమర్శించే బంధువులు

ఎవరైనా బంధువు మిమ్మల్ని ఎప్పుడూ విమర్శించడం, నెగెటివ్ విషయాలను మాట్లాడటం, అందరి ముందు మిమ్మల్ని అవమానించడం చేస్తే అలాంటి వారికి దూరంగా ఉండాలి. వాళ్లతో సంబంధం పెట్టుకోకపోవడమే మంచిదని చాణక్య నీతి చెబుతోంది.

88
అసూయపడే బంధువులు

కొంతమంది బంధువులు మీరు మంచి పనులు చేస్తుంటే చూసి అసూయ పడతారు. చాణక్యుడి ప్రకారం అలాంటి వాళ్లతో క్లోజ్‌గా ఉండకపోవడమే మంచిది. అంతేకాదు ఏ బంధువులతో మాట్లాడితే మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారో, నెగెటివ్ ఆలోచనలు వస్తాయో వాళ్లకు దూరంగా ఉండడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories