Tulsi Plant: ఇంటి గుమ్మానికి తులసి వేర్లు కడితే ఏమౌతుంది?

Published : Mar 20, 2025, 03:33 PM IST

తులసి మొక్కను ఇంటి ఆవరణలో ఉంచుకోవడం చాలా కామన్. కానీ, ఆ మొక్క వేర్లను గుమ్మానికి కడితే ఏమౌతుందో తెలుసుకుందాం..    

PREV
15
Tulsi Plant: ఇంటి గుమ్మానికి తులసి వేర్లు కడితే ఏమౌతుంది?
వాస్తు చిట్కాలు

హిందూ సంప్రదాయం ప్రకారం తులసి మొక్కను చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో ఈ మొక్కను పెంచాలని అనుకుంటారు. అలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుందని నమ్ముతారు. మరి, ఇంటి గుమ్మానికి ఈ మొక్క వేర్లను కట్టడం  వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం...

25

తులసి మొక్కకు హిందూమతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదం. దీని కారణంగా హిందూవులను అనుసరించే ప్రతి ఒక్కరూ వారి ఇళ్లలో తులసి మొక్కను నాటి పూజిస్తారు.

35

వాస్తు శాస్త్రం ప్రకారం తులసి వేరును ఇంటి ప్రధాన ద్వారానికి కడితే సంపద పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఆ ఇంటిపై ఉంటుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

45
ఎలా కట్టాలి?

వాస్తు ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారానికి తులసి వేరును కట్టడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే తులసి మొక్క ఎండిపోయిన తర్వాత దాని వేర్లను తొలగించండి. ఇప్పుడు తులసి వేరును, గుప్పెడు బియ్యం ఎర్రటి వస్త్రంలో వేసి కట్టి, దారంతో మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి.

55
కొన్ని నియమాలు

వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్కను ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లో ఉంటే ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. దీని కోసం మీరు తులసి మొక్కను ఉత్తరం లేదా తూర్పు దిక్కులో ఉంచాలి.

Read more Photos on
click me!

Recommended Stories