Vastu Tips: మీ పర్సులో వీటిని మాత్రం పెట్టకూడదు, ఎందుకో తెలుసా?

వాస్తు శాస్త్రం ప్రకారం.. పర్సులో కొన్ని వస్తువులను పొరపాటున కూడా పెట్టుకోకూడదట. మరి, ఎలాంటివి పెట్టకూడదో తెలుసుకుందామా..

wallet feng shui avoid these items with money in telugu ram

Vastu Tips: హిందూ ధర్మ శాస్త్రం లో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది.  మనం ఇంటిని వాస్తు ప్రకారం కొనుక్కుంటే సరిపోదు. మనం ఇంట్లో ఉంచే వస్తువులతో పాటు,  చేసే చాలా పనులు వాస్తు కిందకే వస్తాయి. తెలిసో తెలియకో మనం చేసే కొన్ని పనులు మనకు చాలా నష్టాలను తీసుకు వస్తాయి. ముఖ్యంగా ఆర్థికంగా చాలా దెబ్బ తీస్తాయి. వాటిలో.. మన పర్సు కూడా ఒకటి. దాదాపు పర్సులో మనం డబ్బులు దాచుకుంటాం. ఆ డబ్బులతో పాటు చాలా మంది చాలా వస్తువులు అందులో పెట్టేస్తూ ఉంటారు. అయితే, వాటి వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మరి , పర్సులో పెట్టకూడని వస్తువులు ఏంటో ఓసారి చూద్దాం...

wallet feng shui avoid these items with money in telugu ram

వాస్తు ప్రకారం, పర్సులో డబ్బుతో పాటు పాత బిల్లులు, రసీదులు అస్సలు పెట్టకూడదు. అలాగే పర్సులో పనికిరాని కాగితాలు కూడా పెట్టకూడదు. ఇలా చేస్తే మీ జీవితంలో నెగెటివ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. ఈ నెగిటివ్ ఎనర్జీ మీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది మీ పర్సులో డబ్బు నిలవకుండా చేస్తుంది.


వాస్తు ప్రకారం, పర్సులో డబ్బుతో పాటు నల్లటి వస్తువులు పెట్టకూడదు. అలా చేస్తే మీ దగ్గరకు డబ్బు రావడం ఆగిపోతుంది. డబ్బుతో నల్లటి వస్తువులు పెడితే నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

వాస్తు ప్రకారం, పర్సులో కత్తి, సూది, తాళం చెవి లాంటివి పెట్టకూడదు. వీటిని పర్సులో డబ్బుతో పాటు పెట్టడం అశుభంగా భావిస్తారు. ఇలా చేస్తే అనవసర ఖర్చులు పెరుగుతాయి. అంతేకాదు, డబ్బు కొరత కూడా వస్తుంది.

Latest Videos

vuukle one pixel image
click me!