Chanakya Niti: పిల్లలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. వారు స్వచ్ఛంగా నవ్వగలరు. ఎప్పుడూ సంతోషంగా ఉండగలరు. అందుకే, వారి నుంచి కొన్ని విషయాలు కచ్చితంగా నేర్చుకుంటే లైఫ్ లో ఈజీగా సక్సెస్ అవ్వగలరు.
మనకు ఎప్పుడో ఒకసారి జీవితంలో అలసట, ఒత్తిడి, నిరుత్సాహం వచ్చేస్తూ ఉంటాయి. కానీ మీరు చిన్న పిల్లలను ఎప్పుడైనా గమనించారా? వారు ఎప్పుడూ ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు. అందుకే, వారి నుంచి కొన్ని విషయాలను నేర్చుకుంటే… జీవితాన్ని చాలా ఆనందంగా గడపొచ్చు. తొందరగా లైఫ్ లో సక్సెస్ అవ్వగలరు అని చాణక్యుడు చెబుతున్నాడు.
26
1. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండటం...
మీరు గమనించారో లేదో... పిల్లలు తొందరగా అలసిపోరు. ఆడుకోవడం, మాట్లాడటం, నేర్చుకోవడం ఏదైనా ఉత్సాహంగా నేర్చుకుంటారు. కానీ, పెద్దవాళ్లు మాత్రం ఊరికే అలసిపోతూ ఉంటారు. మనం కూడా పిల్లల నుంచి ఈ లక్షణం నేర్చుకుంటే... జీవితంలో కచ్చితంగా సక్సెస్ అవ్వగలరు.
36
నేర్చుకోవడం ఆగిపోకూడదు..
చాలా మంది వయసు పెరుగుతుంటే నేర్చుకోవడం మానేస్తూ ఉంటారు. నేర్చుకోవడం మానేస్తున్నాం అంటే... మన ఎదుగుదల అక్కడితో ఆగిపోయినట్లే. అందుకే... ప్రతి నిమిషం ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఉత్సుకత ఉండాలి. చిన్నప్పుడే ఉండే ఉత్సుకతను.. పెద్దయ్యాక కూడా దానిని కంటిన్యూ చేయడం పిల్లల నుంచి నేర్చుకోవాలి. దీని వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది.
3.కారణం లేకుండా సంతోషంగా ఉండటం....
పిల్లలు కారణం లేకుండా నవ్వుతారు. ఉదయం సూర్యుడు ఉదయించినా, కిటికీ బయట పిట్టలు కనిపించినా, వారు సంతోషపడతారు. మనం కూడా ఆనందాన్ని “సాధించాల్సిన” విషయంగా కాకుండా, “అనుభవించాల్సిన” విషయంగా చూడాలి. చిన్న చిన్న విషయాల్లో సంతోషం కనుగొనడం నేర్చుకోవాలి.
మనలో చాలామంది మనకు ఎదురైన వారిని మొదటి చూపులోనే అంచనా వేస్తాం. కానీ పిల్లలు అలా కాదు. వారు అందరినీ ప్రేమగా చూస్తారు. మనం కూడా తీర్పు కాకుండా ప్రేమ, సహానుభూతితో చూడడం ప్రారంభిస్తే, ప్రపంచం మరింత అందంగా మారుతుంది.
పట్టుదల..
పిల్లలు ఏదైనా కోరుకున్నప్పుడు దానిని సాధించేవరకు ప్రయత్నిస్తారు. అదే ఆత్మబలం మనకు కూడా అవసరం. ఏ లక్ష్యం సాధించాలన్నా, పట్టుదలతో ప్రయత్నించడం ద్వారా విజయం సాధించవచ్చు.
56
భావాలను వ్యక్తపరచడం
పిల్లలు సంతోషం, కోపం, కన్నీళ్లు, ప్రేమ అన్నింటినీ స్వేచ్ఛగా చూపిస్తారు. కానీ పెద్దవాళ్లు వాటిని దాచేస్తారు. మన భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం బలహీనత కాదు. అది మానసిక ఆరోగ్యానికి అవసరం. భావాలను పంచుకోవడం ద్వారా మన బంధాలు బలపడతాయి.
7.ఒకరిపై ఆధారపడటం...
పిల్లలు తల్లిదండ్రులపై సహజంగానే ఆధారపడతారు. మనం మాత్రం “నాకు ఎవరి సహాయం అవసరం లేదు” అనే భావనతో ఉంటాం. కానీ కుటుంబం, స్నేహితులపై ఆధారపడటం తప్పు కాదు. అది బంధాలను మరింత బలపరుస్తుంది.
8. ఆశ్చర్యంతో ప్రపంచాన్ని చూడడం
పిల్లలు కొత్త విషయాలను చూసినప్పుడు “వావ్!” అనేస్తారు. ఆ ఆశ్చర్యభావం మనకు కూడా ఉండాలి. కొత్త అనుభవాలను స్వీకరించడం ద్వారా మనం సృజనాత్మకంగా, సంతోషంగా జీవించగలం.
66
చాణక్య నీతి...
జీవితం ఎప్పుడూ సీరియస్‌గా కాకుండా, పిల్లల మాదిరిగా సింపుల్‌గా, సంతోషంగా చూడండి. ఉత్సాహం, ప్రేమ, ఆసక్తి, ఆనందం ఇవన్నీ మనలోనే ఉన్నాయి. వాటిని మళ్లీ వెలికి తీయండి, మీ జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చుకోమని చాణక్యుడు చెబుతున్నాడు.