Sankranthi 2022: భోగి పండుగనాడు చెయ్యాల్సిన నైవేద్యాలు, పిండివంటలు ఇవే!

First Published | Jan 11, 2022, 1:11 PM IST

Sankranthi 2022: సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి పండుగ (Bhogi festival) రోజు తప్పక చేసుకునే కొన్ని నైవేద్యాలు, పిండి పదార్థాలు ఉన్నాయి. వీటిని చేసుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించి మనం స్వీకరిస్తే సిరిసంపదలు (Wealth) కలుగుతాయని విశ్వాసం. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

సూర్యుని ప్రధానంగా చేసుకుని ఆయన గమ్యాన్ని ప్రధానంగా చేసుకుని జరుపుకునే ప్రధాన పండగే  భోగి పండుగ. చలికాలంలో శరీరంలో ఉష్ణశాతం    తక్కువగా ఉంటుంది. కనుక భోగి రోజున చేసుకునే ఆహార పదార్థాలు (Foods) శరీర ఉష్ణోగ్రతను పెంచడంతోపాటు ఆరోగ్యాన్ని (Health) అందిస్తాయి.
 

భోగి రోజున ఉదయము గుమ్మడి కాయను (Pumpkin) పగులగోట్టి గుమ్మడికాయతో తీపిపదార్థాలు (Sweets) చేస్తారు. అలాగే కొత్త బియ్యం, పెసరపప్పు, ఆవు పాలు, బెల్లం, నెయ్యి తో చేసిన పాయసాన్ని చేయాలి. ఆవు పాలు, ఆవు నెయ్యి స్వచ్ఛతకు, సాత్వికతకి మారుపేరు.
 

Latest Videos


కాబట్టి ఈ పదార్థాలతో చేసిన నైవేద్యమంటే భగవంతుడికి ఎంతో ప్రీతి. పెసరపప్పు (Pesarapappu) శరీరానికి చలువ చేస్తుంది. శరీరంలో మనం తీసుకునే ఆహారాన్ని ఎక్కువ, తక్కువలు చేస్తుంది. పెసరపప్పు, కొత్త ధాన్యం, ఏదైనా ఉద్యోగం, జీవితం వచ్చిన, వ్యాపారంలో మొదటగా లాభం వచ్చిన భగవంతునికి (God) కొంత సమర్పించుకుంటారు.
 

కాబట్టి ఈ పండుగ రోజున కొత్తగా ఇంటికి వచ్చిన ధాన్యాన్ని భగవంతునికి ప్రసాదంగా నివేదించాలని తీసిపెడతారు. అలా పండించలేని వారు కొత్త బియ్యాన్ని కొని భగవంతునికి ప్రసాదం (Prasadham) వండి నివేదిస్తారు. కొత్తబియ్యం ప్రసాదాన్ని, గుమ్మడికాయ తీపి పదార్థాన్ని (Pumpkin sweet) భగవంతునికి నైవేద్యంగా సమర్పించాలి.
 

అలాగే పెసలు, బియ్యం, మిరియాలు, ఉప్పు కలిపిన పొంగలిని (Pongali) నైవేద్యంగా పెడతారు. పొంగలిలో ఉపయోగించే మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. భోగి రోజున వండుకునే  పిండి పదార్థాల్లో కూడా ప్రత్యేకత (Specialization) ఉంది. చలికాలంలో శరీరంలో ఉష్ణశాతం తక్కువగా ఉంటుంది.
 

కనుక నువ్వులతో (Sesame) చేసుకున్న పిండి పదార్థాలను స్వీకరించడం ఆరోగ్యానికి మంచిది. నువ్వులతో అరిసెలు, సకినాలు, మురుకులు చేసుకొని ఆహారంగా స్వీకరిస్తారు. ఇలా ఎవరి ఓపికకు (Patience) తగ్గట్టుగా వారు అనేక రకాల పిండి వంటలను తయారు చేసుకుంటారు. నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మంచిది.
 

కనుక చాలా ప్రాంతాలలో నువ్వులతో రొట్టెలు కూడా చేసుకుని గుమ్మడి కూరతో ఆహారాన్ని స్వీకరిస్తారు. ఇలా ప్రాంత సాంప్రదాయం, కుటుంబ సంప్రదాయాన్ని బట్టి రకరకాల వంటలు చేసుకుంటారు. ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ (Prioritizing) చక్కెరకు బదులుగా బెల్లాన్ని (Jaggery) ఉపయోగించి పిండి పదార్థాలను తయారు చేసుకుంటారు.  
 

ఈ ఆహారపదార్థాలు ఎంతో రుచితో (Taste) పాటు శరీరానికి మంచి ప్రయోజనాలను అందిస్తాయి. కనుక ఈ పదార్థాలను భోగిరోజున చేసుకుని దేవునికి నైవేద్యంగా సమర్పించి మనం తీసుకుంటే సకల సంపదలు కలగడంతో పాటు ఆరోగ్యం చేకూరుతుంది. ఈ పండుగ రోజున కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు (Relatives) ఎక్కువ మంది ఉంటారు.
 

కనుక అనేక రకాల వంటలు చేసి వారిని సంతోషపెడితే (Happiness) సిరి సంపదలు చేకూరుతాయని పెద్దల విశ్వాసం. కాబట్టి ఈ విధంగా ఈ పిండిపదార్థాలను నైవేద్యాలను దేవునికి సమర్పించి స్వీకరిస్తే భోగభాగ్యాలు (Luxuries) కలుగుతాయి.

click me!