ఈ రోజు తలస్నానం చేయకండి.. లేదంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది

Published : Oct 12, 2023, 10:21 AM IST

హిందూ మతంలో..  ప్రతి రోజూ ఏదో ఒక దేవతకు అంకితం చేయబడింది. అలాగే ప్రతిరోజుకు సంబంధించిన నియమాలు కూడా చెప్పబడ్డాయి. వారంలో కొన్ని రోజులు హెయిర్ వాష్ చేయడం, జుట్టును కట్ చేయడం, గోర్లు కట్ చేయడం లేదా షేవింగ్ చేయడం వంటివి నిషిద్ధంగా పరిగణించబడతాయి. అయితే వారంలో ఒక రోజున తలస్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందరని జ్యోతిష్యులు చెబుతున్నారు. అది ఏ రోజంటే..? 

PREV
14
ఈ రోజు తలస్నానం చేయకండి.. లేదంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది

హిందూమతంలో.. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో నియమాల గురించి ఉంటుంది. గ్రంధాలలో పేర్కొన్న నియమాలను పాటిస్తే జీవితంలో సుఖసంతోషాలు ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు ఈ నియమాలను ఉల్లంఘిస్తే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అలాగే హెయిర్ వాష్ కు సంబంధించి కూడా నియమాలను పాటించాలి. ముఖ్యంగా వారంలో కొన్ని రోజులు హెయిర్ వాష్ చేయకూడదు. అదెప్పుడంటే..?

24
hair wash

ఈ రోజున తలస్నానం చేయకూడదు.

పెళ్లికాని అమ్మాయిలు బుధవారం నాడు హెయిర్ వాష్ చేయడం శుభప్రదంగా పరిగణించబడదు. ఈ రోజున పెళ్లి కాని అమ్మాయిల తలస్నానం చేస్తే వీళ్లు జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

34
Hair wash

మంగళ, గురు

పెళ్లైన ఆడవారు మంగళవారం, గురువారం, శనివారాల్లో తలస్నానం చేయకూడదని జ్యోతిష్యం చెబుతోంది. ఈ రోజున వివాహిత స్త్రీ తలస్నానం చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. అలాగే లక్ష్మీదేవికి శుక్రవారం  అంకితం చేయబడింది.అందుకే ఈ రోజున పెళ్లైన ఆడవారు ఈ రోజు తలస్నానం చేసి లక్ష్మీదేవికి పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా పోతాయి. 
 

44
Hair wash

గురువారం

స్త్రీ, పురుషులిద్దరూ గురువారం నాడు తలస్నానం చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. హిందూ మతంలో.. గురువారాన్ని బృహస్పతికి అంకితమైన రోజుగా భావిస్తారు. అందుకే ఈ రోజున హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బాగుండదు. అంతేకాదు ఈ రోజు జుట్టుకు నూనెను కూడా పెట్టకూడదు. అలాగే ఏకాదశి, అమావాస్య, పూర్ణిమ నాడు కూడా తలస్నానం చేయడం, కట్ చేయడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories