వాస్తు శాస్త్రంలో దిశలను ముఖ్యమైన వాటిగా భావిస్తారు. మొత్తం 4 దిక్కులు ఉంటాయి. ఉత్తరం, పడమర, తూర్పు, దక్షిణం. ఈ దిక్కులన్నీ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. అయితే వాస్తు శాస్త్రంలో ఉత్తర దిశకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్యుల ప్రకారం.. ఉత్తర దిశలో కొన్ని వస్తువులను పెడితే మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటూ ఉండదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
vastu tips
ఉత్తర దిశ ప్రాముఖ్యత
వాస్తు శాస్త్రంలో ఉత్తరదిశను ఎంతో పవిత్రంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఉత్తర దిశను సానుకూల శక్తికి ప్రవేశ ద్వారంగా భావిస్తారు. అంతేకాదు ఈ దిశను దేవతల దిశ అని కూడా అంటారు. ఈ దిశలో సంపదకు అధిపతి అయిన కుబేరుడు నివాసిస్తున్నట్టుగా భావిస్తారు. అలాగే ఈ దిశను కూడా లక్ష్మీదేవి ఆవాసంగా భావిస్తారు.
సురక్షితమైన ప్రదేశం
డబ్బులు, నగల లాకర్ లు ఉత్తర దిశలోనే ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ దిశ కుబేరుడు, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీకు కలిగిస్తుంది. అందుకే ఈ దిశలోనే లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించి పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది. అలాగే వీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోరని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మొక్కలు
మనీ ప్లాంట్ తెలియని వారుండదు. ఇంట్లో మనీ ప్లాంట్ ను పెంచడం వల్ల సంపదకు ఎలాంటి కొదవ ఉండదని.. సంపద మరింత పెరుగుతుందని నమ్ముతారు. అలాగే సనాతన ధర్మంలో పవిత్రంగా భావించే తులసిని ఉత్తర దిశలో ఉంచడం వల్ల కూడా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఇంటి వంటగది
వాస్తు ప్రకారం.. ఇంటి వంటగది కూడా ఉత్తర దిశలోనే ఉంచాలి. వంటగది ఈ దిశలో ఉండటం వల్ల మీకు ఆహార కొరత అనేదే ఉండదు. అలాగే మీ ఇంటి వంటగది ఉత్తర దిశలోని గోడలకు లేత నీలం రంగును వేయాలి.