మాస శివరాత్రి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకొస్తే మీ అదృష్టం మారుతుంది

First Published Oct 10, 2023, 9:49 AM IST

Masa Shivratri 2023  : మాస శివరాత్రి ఉపవాసం శివ భక్తులకు ఎంతో పవిత్రమైనది. ఈ ఏడాది అక్టోబర్ 12న మహా శివరాత్రిని జరుపుకోనున్నారు. ఈ రోజున శివ భక్తులు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శివుడిని పూజిస్తారు. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. 

మాస శివరాత్రి నాడు శివుడిని నిష్టగా పూజిస్తారు. ఈ రోజు భోళాశంకరుడికి అంకితం చేయబడింది. కాగా ఈ ఏడాది మాస శివరాత్రి అక్టోబర్ 12న న వచ్చింది. ఈ రోజు శివుడితో పాటుగా పార్వతీదేవిని కూడా పూజిస్తారు. 
 

sawan shivratri 2022

మాస శివరాత్రి నియమాలు

మాస శివరాత్రినాడు శివపార్వతులను పూజిస్తారు. అలాగే విజయం సాధించడానికి, కోరికలన్నీ నెరవేరడానికి ఉపవాసం కూడా ఉంటారు. అందుకే ఈ రోజంతా శివుని కోసం ఉపవాసం ఉండి ఆయనను ధ్యానిస్తారు. ఈ సమయంలో ఉపవాసం ఉండేవారు శివ మంత్రాలను పఠిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివుడికి హారతి ఇస్తారు. ఈ సమయంలో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటారు. ఆ తర్వాతే ఉపవాసం విడిచి పండ్లు తింటారు. అంతేకాదు ఆ రోజు రాత్రి భజన కీర్తనలు కూడా చేస్తారు. మరుసటి రోజు శివుడికి పూజలు చేసి ఉపవాస దీక్షను ముగిస్తారు. మరి శివరాత్రి నాడు శివుడి అనుగ్రహం పొందడానికి ఆ రోజు ఇంటికి ఏయే వస్తువులను తీసుకురావాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

shami plant

జమ్మి మొక్క 

జమ్మి మొక్కను శనీశ్వరుని చిహ్నంగా భావిస్తారు. దీనిని మాస శివరాత్రి నాడు ఇంటికి తీసుకొస్తే శివుడితో పాటు శనిదేవుని అనుగ్రహం కూడా పొందుతారని నమ్ముతారు. ఈ రోజున జమ్మి మొక్కను ఇంటికి తీసుకురావడం చాలా పవిత్రమైనదిగా, శుభప్రదంగా భావిస్తారు.

బిల్వ పత్రం 

బిల్వపత్రం శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనది. మీ జీవితంలో మీరు సంతోషంగా, సిరిసంపదలతో ఉండాలంటే మాస శివరాత్రి నాడు ఇంట్లోకి బిల్వపత్రాన్నిఖచ్చితంగా తీసుకురండి. ఈ రోజు వైన్ మొక్కను కూడా ఇంటికి తీసుకురావొచ్చు. మాస శివరాత్రినాడు స్నానం చేసిన తర్వాత ద్రాక్ష మొక్కను ఇంటికి ఉత్తర దిశలో నాటాలి. ఇలా చేయడం వల్ల దేవతల దేవుడైన పరమేశ్వరుడు సంతోషిస్తాడు. అతని అనుగ్రహం మీపై ఉంటుంది. 

శివలింగం 

పురాణాల ప్రకారం.. మాస శివరాత్రి రోజున పరాద్ శివలింగాన్ని ఇంటికి తీసుకురావడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మీరు పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలనుకుంటే ఈ ప్రత్యేకమైన రోజున పరాద్ శివలింగాన్ని మీ ఇంటికి తీసుకురండి. అలాగే  ప్రార్థనా స్థలంలో పరాద్ శివలింగాన్ని ప్రతిష్టించి పూజించండి. 

ఢమరుకం

ఢమరుకం శివునికి ఎంతో ప్రీతికరమైనది. మత విశ్వాసాల ప్రకారం.. మాస శివరాత్రి రోజున ఢమరుకాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ ప్రత్యేకమైన రోజున ఢమరుకాన్ని మీ ఇంటికి తీసుకురండి. అలాగే ఈ ఢమరుకాన్ని మీ ఇంటి గుడిలో ప్రతిష్టించండి.
 

click me!