Valmiki Jayanti: ఒక బోయవాడు అయిన వాల్మీకి మహాన్నత వ్యక్తిగా మారిన రామాయణం అనే మహా కావ్యాన్ని రచించాడు. నేడు వాల్మీకి జయంతి వేళ అసలు రామాయణం నుంచి మనిషి నేర్చుకోవాల్సిన 5 ముఖ్యాంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా, మనకు జీవిత పాఠాలను నేర్పిన రామాయణాన్ని గుర్తు చేసుకోవాలి. వాల్మీకి రచించిన రామాయణం, మంచి మీద చెడు విజయం సాధిస్తుందన్న సందేశాన్నిఅందిస్తుంది. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, ధర్మం, నీతి, స్నేహం, కుటుంబ విలువలను మనకు నేర్పే ఒక అద్భుత పాఠంలా ఉపయోగపడుతుంది.
26
ఐక్యత, సంబంధాల విలువను నేర్పుతుంది
రాముడికి అన్ని సంబంధాలు ముఖ్యమైనవి. అయోధ్యను వదిలి వెళ్లమని చెప్పినా తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. అతనికి అవసరం లేకపోయినా తన అన్నకు దక్కని రాజ్యం తనకు అవసరం లేదని లక్ష్మణుడు కూడా అడవి బాట పట్టాడు. భరతుడికి రాజ్యం దక్కినా బాధ్యతను స్వీకరించలేదు కదా.. సింహాసంపై రాముడి పాదుకలు ఉంచి పాలించాడు. రాజసింహాసనాన్ని స్వీకరించకుండా రాముడు తిరిగొచ్చే వరకు సింహాసనాన్ని అధిష్టంచలేదు.
పాఠం: కుటుంబం, స్నేహం, ప్రేమను ప్రాధాన్యం ఇవ్వండి. ఐక్యతలోని శక్తి, జీవనంలో ఏమైనా సమస్యలు ఎదురైనప్పటికీ, మనకు ముందడుగు వేయడానికి సహాయం చేస్తుంది.
36
అందరినీ సమానంగా చూడాలి
రాముడు అందరితో సమానంగా ప్రవర్తించారు. శబరి అనే పేద మహిళ ఎంగిలి చేసి ఇచ్చిన ఫలాలను సంతోషంగా తిన్నారు. వానరులతో జత కట్టాడు, వారి కష్టాలను తీర్చాడు.
పాఠం: ప్రతి వ్యక్తిని ప్రేమించండి, గౌరవించండి. కులం, మతం, వర్ణం, స్థానం ఆధారంగా ఎవరినీ వేరు చేయవద్దు.
కైకేయి.. మొదట్ల రాముడి పట్ల ప్రేమగా ఉండేది. కానీ మంథర అనే దుర్మార్గ సలహాదారు ఆమె మనసును తప్పుదారిలో నడిపించింది. దీంతో రాముడిని వనవాసానికి పంపించాలని కైకేయి పట్టుబట్టింది.
పాఠం: నెగిటివ్ సలహాలు ఇచ్చే, దుర్మార్గులను దూరంగా ఉంచండి. మనసు నెగటివ్ అయ్యితే, మంచి లక్షణాలను మనం కోల్పోతాం.
56
క్షమా గుణం
రాముడు క్షమా గుణానికి పెట్టింది పేరు. తనను ఎంత ఇబ్బంది పెట్టిన వారికి కూడా ఏరోజు చెడు జరగకూడదని కోరుకున్నాడు. తను అరణ్యవాసానికి కారణమైన కైకేయిని కూడా క్షమతో వదిలి పెట్టాడు. కానీ రావణుడు మాత్రం తన సోదరి సుర్పణఖా తప్పు చేసిందని తెలిసినా.. రాముడిపై కోపం పెంచుకొని ప్రతీకారంగా సీతను అపహరించాడు. అదే అతని మరణానికి కారణమైంది.
పాఠం: క్షమించగలగడం వల్ల మనలో శాంతి, సమతౌల్యం పెరుగుతుంది. కోపం, ప్రతీకారం ఎప్పుడూ మంచి ఫలితాలను అందించవు.
66
ఎప్పటికైనా మంచిదే విజయం
రావణుడు శివ భక్తుడు, బ్రాహ్మణుడు అయినా అతని క్రూర మనస్తత్వం, అహంకార గుణం అతని నాశనానికి కారణమయ్యాయి. సీతమ్మను కాపాడే క్రమంలో రామయ్య ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా చివరికి విజయాన్ని అందుకున్నారు.
పాఠం: జీవితంలో పరిస్థితులు ఎంత కష్టమైనా, మంచి ఎల్లప్పుడూ చెడుపై విజయం సాధిస్తుంది.
రామాయణం మనకు నేర్పిన ఈ పాఠాలు నిజంగా జీవనానికి మార్గదర్శకంగా ఉంటాయి. ఈ పాఠాలను పాటించడం ద్వారా మన జీవితంలో శాంతి, సమరస్యం, సంతృప్తి పొందవచ్చు.