రొమాన్స్ బోర్ కడుతోందా? ఇలా ప్రయత్నించండి..!

First Published Jan 13, 2022, 4:27 PM IST

 కొన్నేళ్లుగా కలిసి ఉన్న తర్వాత, మీ సంబంధం సౌకర్యవంతంగా , తేలికగా అనిపించవచ్చు, రొమాన్స్ బోర్ కొట్టే అవకాశం ఉంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే.. కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.. మళ్లీ మీరు రొమాన్స్ లో రెచ్చిపోవచ్చు.

ఒకరితో ప్రేమలో పడటం అనేది  చాలా సర్వ సాధారణ విషయం. అయితే.. ప్రేమ బంధం మొదలైన తొలిరోజుల్లో.. అంతా  బాగానే ఉంటుంది. రొమాన్స్ చాలా కొత్తగా ఉంటుంది. కానీ.. పోను పోను  ఒకే వ్యక్తితో ఎక్కువసేపు ఉండడం వల్ల నీరసంగా, బోరింగ్‌గా అనిపించవచ్చు. కొన్నేళ్లుగా కలిసి ఉన్న తర్వాత, మీ సంబంధం సౌకర్యవంతంగా , తేలికగా అనిపించవచ్చు, రొమాన్స్ బోర్ కొట్టే అవకాశం ఉంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే.. కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.. మళ్లీ మీరు రొమాన్స్ లో రెచ్చిపోవచ్చు.

ఈ రోజుల్లో అందరూ పని కారణంగా.. చాలా బిజీగా ఉంటారు. ఇలాంటి సమయంలో రొమాన్స్ కి చోటు ఇవ్వడానికి చాలా మందికి కుదరకపోవచ్చు. కానీ.. మీ బంధం సంతోషంగా ఉండాలి అంటే.. మీరు కచ్చితంగా.. రొమాన్స్ కి సమయం కుదుర్చుకోవాలి. అందుకోసం సమయాన్ని షెడ్యూల్ చేసుకోవాలి.

 మీ భాగస్వామితో క్రమం తప్పకుండా నాణ్యమైన సమయాన్ని గడపడం, మీ ఇద్దరి గురించి మాట్లాడుకోవడం బలమైన కనెక్షన్‌ని కొనసాగించడంలో కీలకం. మీరు ఫ్యాన్సీ రెస్టారెంట్‌లకు వెళ్లాలని మేము చెప్పడం లేదు, మీ వంటగదిలో లేదా పెరట్‌లో డేట్ నైట్ ప్లాన్ చేసుకోవాలి. ఇద్దరూ సరదాగా గేమ్స్ ఆడుతూ కాసేపు గడపాలి. అది చాలా రొమాంటిక్ గా ఉంటుంది.

కలిసి కొత్తగా ఏదైనా ప్రయత్నించండి

మీరు కొత్త వ్యక్తితో కొత్త జ్ఞాపకాలను క్రియేట్ చేస్తున్నందున సంబంధం ప్రారంభం సాఫీగా , ఉత్సాహంగా ఉంటుంది. ఒకే వ్యక్తితో ఏళ్ల తరబడి గడపడం వల్ల అన్వేషించడానికి కొత్తగా ఏమీ లేదని మీరు భావించవచ్చు, కానీ అది చాలా పొరపాటు.  ఇద్దరూ కలిసి ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే... చాలా రొమాంటిక్ గా ఉంటుంది.. ఆకస్మిక, ఆహ్లాదకరమైన కార్యకలాపాలను కలిసి ప్రయత్నించడం ద్వారా మీ బోరింగ్ రొటీన్‌కు కొంత ఉత్సాహాన్ని జోడించండి. 


ఆప్యాయత చూపండి

సినిమా చూస్తున్నప్పుడు మీరు మీ భాగస్వామిని పట్టుకోవడం, చిన్నగా ముద్దు పెట్టుకోవడం లాంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల  సంరక్షణ, ప్రేమ ,భద్రత సంకేతాలను పంపే ఎండార్ఫిన్‌లు, ఆక్సిటోసిన్లు విడుదలౌతాయి. ఇవి మీలో మళ్లీ రొమాన్స్, శృంగారం పట్ల ఆసక్తిని పెంచడానికి సహకరిస్తాయి. 
 

బెడ్‌రూమ్‌లో స్పైస్ థింగ్స్ అప్

ఇక.. బెడ్రూమ్ లో రొమాన్స్ కి కొంత స్పైసీ నెస్ జత చేయాలి. అంటే.. ఎప్పుడూ ఒకేలా సెక్స్ చేయడం కాకుండా.. కొంచెం భిన్నంగా ప్రయత్నించాలి. రోల్ ప్లే చేయడం, వివిధ భంగిమల్లో సెక్స్ ఎంజాయ్ చేయడం లాంటివి చేయాలి. అప్పుడు.. మళ్లీ రొమాన్స్ ఆసక్తిగా మారుతుంది.

click me!