అతనికి అప్పటికే పెళ్లయ్యింది. కొడుకు కూడా ఉన్నాడు. కానీ.. భార్య చనిపోవడంతో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే.. కొన్ని సంవత్సరాలపాటు వారు బాగానే ఉన్నారు. సవతి కొడుకు కూడా ఆమెను తల్లిగా స్వీకరించాడు.
నిత్యం.. అమ్మ, అమ్మ అంటూ పిలిచేవాడు. వాళ్లని చూసి అతను సంబరపడిపోయాడు. కానీ చివరకు వాళ్లిద్దరూ కలిసి అతనికే ద్రోహం చేశారు.
అతని రెండో భార్య.. తన కొడుకుతో కలిసి లేచిపోయింది. ఈ సంఘటనతో అతను షాక్ కి గురయ్యాడు. ఈ సంఘటన యూకేలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అలెక్సీ అనే వ్యక్తి మొదటి భార్య చనిపోవడంతో మెరీనా(35) ను రెండో వివాహం చేసుకున్నాడు. అలెక్సీ రెండో పెళ్లి చేసుకునే సమయంలో అతనికి కొడుకు వోవా వయసు 7సంవత్సరాలు కావడం గమనార్హం.
కాగా.. వోవా కొద్ది కాలంలోనే మెరీనాను తల్లిగా స్వీకరించాడు. అమ్మ, అమ్మ అంటూ పిలిచేవాడు. మెరీనా కూడా వీవాను ఎంతో ప్రేమగా చూసేది. కొన్ని సంవత్సరాలపాటు వారి కుటుంబం ఆనందంగా జీవించింది.
కాగా.. ఇప్పుడు వీవా వయసు 20 సంవత్సరాలు కాగా.. ఇటీవల తన సవతి తల్లి మెరీనాతో కలిసి లేచిపోయాడు. ఈ సంఘటన తెలిసి అలెక్సీ షాకయ్యాడు.
భర్తకు తెలీకుండా సవతి కొడుకుతో కలిసి మెరీనా వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. వాళ్లిద్దరూ కలిసి సంసారం కూడా చేస్తున్నారు. త్వరలో వారు ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ప్రస్తుతం తాను గర్భవతినని మెరీనా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
తాము చేసిన పనికి సిగ్గు పడటం లేదని ఆమె స్వయంగా చెప్పడం విశేషం. తన జీవితానికి సంబంధించిన వీడియెని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.
కాగా.. తన భార్య కొడుకుతో లేచిపోవడం పై అలెక్సీ కూడా స్పందించాడు. తన భార్య మెరీనా.. చిన్నపిల్లాడైనా తన కొడుకుని మాయ చేసి అలా చేసిందని చెప్పాడు
ఇప్పటి వరకు తన కొడుకుకి కనీసం ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదని చెప్పాడు. తన భార్య ఇదే తప్పు మరే ఇతర వ్యక్తితో చేసినా తాను క్షమించేవాడనని ... కానీ ఆ తప్పు తన కొడుకుతో చేయడం తాను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పడం గమనార్హం.
తాను ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్లు ఒకే గదిలో గడిపేవారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను నిద్రపోగానే తన భార్య వెంటనే తన కొడుకు గదిలోకి పరిగెత్తేదని అతను వాపోయాడు.
తాను నిద్రలేచేసరికి... ఏమీ జరగనట్టు వచ్చి మళ్లీ నా పక్కన పడుకునేదని చెప్పాడు. వాళ్లిద్దరి విషయం నాకు తెలిసిన వెంటనే విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెప్పాడు.
విచిత్రం ఏమిటంటే... తన సవతి కొడుకు వయసు 7 సంవత్సరాలు ఉన్న సమయంలో తన వయసు 22 అని.. ఇప్పుడు అతనికి 20 ఏళ్లు అంటూ.. అప్పుడూ, ఇప్పుడూ దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాగా.. ఇది సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆమె చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు.