శృంగారమంటే ఆసక్తి లేని వారు అరుదుగా ఉంటారు. దాని మీద ఎంత ఆసక్తి ఉన్నా... కొందరు మాత్రం పడక గదిలో ఫెయిల్ అవుతూ ఉంటారు.
జీవిత భాగస్వామితో ఎలా ఉండాలి? ఎలా మెప్పించాలి? అనే విషయాలు తెలుసుకోకపోవడంతో నిరాశ, నిస్పృహలో తమలో పెంచుకున్నారు.
ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ యుగంలో.. భార్యభర్తలు ఇద్దరూ కలిసి కాసేపు సమయం గడపడమే గగనమైపోయింది. దొరికిన కాస్తో, కూస్తో సమయంలోనే పార్టనర్ ని మెప్పించాలి. అందుకు ఏం చేయాలో నిపుణులు సూచిస్తున్నారు
ముందుగా పురుషులు కొన్ని అలవాట్లు మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఆ అలవాట్లు మార్చుకుంటే శృంగారాన్ని తనివి తీరా ఆస్వాదించవచ్చని చెబుతున్నారు.
చాలా మంది భార్యల మనుసులు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం వల్లే శృంగారంలో ఫెయిల్ అవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ బోరింగ్ బెడ్రూమ్ లో కాకుండా కొత్త ప్రదేశాలకు కూడా తీసుకువెళుతూ ఉండాలి. అలా చేయడం వల్ల శృంగారాన్ని మరింత ఎక్కువగా ఆస్వాదించగలరు.
స్మోకింగ్ మనిషిని చంపేస్తుంది. ఈ విషయం తెలిసినా కూడా ఆ అలవాటు ఉన్నవారు దానిని వదలుకోలేరు. చాలా మంది భార్యలకు తమ భర్తలు స్మోక్ చేయడం నచ్చదు. ముఖ్యంగా పడక గదిలోకి వచ్చే సమయంలో... స్మోక్ చేసి ఉండటాన్ని స్త్రీలు అంగీకరించరు.
ఆ వాసన దాదాపు ఎవరికీ నచ్చదు. ఈ ఇష్టాయిష్టాలు పక్కన పెడితే... ఈ స్మోకింగ్ అలవాటు భవిష్యత్తులో మీ సెక్స్ సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గించేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం... సెక్స్, సిగరెట్.. తూర్పు పడమర లాంటివి అంటున్నారు.
ఈ రెండింటిలో ఏదో ఒక్కటి మాత్రమే దొరకుతుందనేది వారి అభిప్రాయం. ఈ రెండింటిని ఒకేసారి పొందడం కష్టమనేది వారి వాదన. ఎందుకంటే.. సిగరెట్ లైంగిక వ్యవస్థ పై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
సిగరెట్ లో ఉండే నికోటిన్ రక్త ప్రవాహ వ్యవస్థను దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ అలవాటును కూడా మానుకోవడం తప్పనిసరి.
చాలా మంది జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటుంది. వారానికి ఒక్కసారి, రెండు సార్లే కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ వారి సెక్స్ జీవితాన్ని నాశనం చేస్తుందని గుర్తించరు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగదు. దీంతో సెక్స్ ఇంటస్ట్ర్ కూడా తగ్గిపోతోంది.
అంతేకాకుండా వంటల్లో ఎక్కువగా ఉప్పు తినడం కూడా అంత మించిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. మితి మీరి మద్యం సేవించే అలవాటు కూడా మానేయడం మంచిదని చెబుతున్నారు.
ఇక చాలా మంది పని ఒత్తిడిలో పడి సరిపడా నిద్ర కూడా పోరు. అలాంటి వారు శృంగారంలో వెనకపడిపోతారు. ఓ సర్వేలో తేలిందేంటంటే.. సరిపడ నిద్రపోయే స్త్రీలు శృంగారాన్ని మరింత ఆస్వాదిస్తారని తేలింది.