వయసుకీ, మనకు చాలా సంబంధం ఉంది. పుట్టినప్పటి నుంచి.. కాటికి కాళ్లు చాపుకునే వరకు.. ప్రతి విషయాన్ని మన సమాజం వయసుతోనే ముడిపెడుతుంది. ఈ వయసులో అలా చేయాలి.. ఈ వయసులో ఇలా చేయాలి.. ఈ వయసులో ఆయనకు ఇదేం బుద్ధి.. ఇలాంటి మాటలు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం.