పురుషులు... తమ పార్ట్ నర్ నుంచి వినాలి అనుకునేవి ఇవే..!

First Published | Mar 14, 2022, 1:04 PM IST

నువ్వు చేసిన పని  బాగుందనో.. వేసుకున్న డ్రస్ బాగుందనో, లేకుంటే అందంగా  ఉన్నావనో.. చెప్పాలట. అలా చెప్పడం వల్ల వారు హ్యాపీ గా ఫీలౌతారు. 

ప్రేమ కేవలం.. స్త్రీలే కాదు.. పురుషులు కూడా కోరుకుంటారు. తమ భాగస్వాముల నుంచి అమితమైన ప్రేమ దక్కించుకోవాలని చాలా మంది పురుషులు ఎదురుచూస్తూ ఉంటారట. ప్రేమ అంటే.. కేవలం చేతల్లోనే కాదట.. మాటల్లో అంటే.. కాంప్లిమెంట్స్ రావాలని వారు కూడా కోరుకుంటారట. మరి పురుషులు తమ పార్ట్ నర్ నుంచి ఎలాంటి మాటలు వినాలని అనుకుంటారు..? ఎలాంటి కాంప్లిమెంట్స్ వినాలని అనుకుంటున్నారో ఓసారి చూసేద్దాం..

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచిగా ఉండటానికి ప్రేరేపించే వ్యక్తిని కలిగి ఉండాలని కోరుకుంటారు.అదే పురుషులు కూడా కోరుకుంటారట. నేను నిన్ను నమ్ముతున్నాను అనే మాట వినాలని ప్రతి అబ్బాయి కోరుకుంటారట.  అందుకే.. మీ పార్ట్ నర్ కి నేను నిన్ను నమ్ముతున్నాను అని మాట చెప్పాలట. 


తాము ఏదైనా మంచి పని చేసినప్పుడు.. దానిని ఎవరైనా పొగిడితే.. మనం చాలా సంతోషంగా ఫీలౌతాం. పురుషులు కూడా అదే ఫీలౌతారట. ముఖ్యంగా  తమ పార్ట్ నర్ తమను పొగిడితే వారు చాలా హ్యాపీ గా ఫీలౌతారట. తాము చేసిన పనిని వారు గుర్తించాలని వారు అనుకుంటూ ఉంటారట.  నువ్వు చేసిన పని  బాగుందనో.. వేసుకున్న డ్రస్ బాగుందనో, లేకుంటే అందంగా  ఉన్నావనో.. చెప్పాలట. అలా చెప్పడం వల్ల వారు హ్యాపీ గా ఫీలౌతారు. 

ప్రతి మనిషి వారు తమ భాగస్వామి జీవితానికి ఎలా దోహదపడ్డారో  తెలుసుకోవాలనుకుంటారు. మిమ్మల్ని ప్రేమగా, సురక్షితంగా , వెచ్చగా ఉంచడానికి వారు చేస్తున్న ప్రయత్నాలకు మీరు ఎంత కృతజ్ఞతతో ఉన్నారో మీ మనిషికి చెప్పడం వారి హృదయాలను లోతుగా ప్రభావితం చేస్తుంది.

valentine's day

విజయాల కోసం ప్రశంసలు పొందడం చాలా పెద్ద విషయం.  దాని కోసం అభినందనలు పొందడం మరింత పెద్దది. మీ కష్టాన్ని చూసి ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకుంటే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చాలా సంతోషంగా, గర్వంగా భావిస్తారు. కాబట్టి వారు సాధించిన విజయాన్ని గుర్తించి దానిని పొగిడించాలి.

movie

అంతేకాదు.. మీరు మీ భాగస్వామిని ప్రేమించగానే సరిపోదు. మీరు ఎంత ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని కూడా మీ భర్తకు చెప్పాలట. వారు.. ఆ విషయం మీ నుంచి వినాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారట.  కాబట్టి..  మీరు మీ పార్ట్ నర్ ని ఎంత ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని చెబుతూ ఉండాలట.

Latest Videos

click me!