పీరియడ్స్ కు ముందు సెక్స్ కోరికలు పెరుగుతాయా?

First Published | Nov 24, 2023, 3:47 PM IST

పీరియడ్స్ లో ఆడవారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే ఈ సమయంలో వారు ఎన్నో రకాల భావోద్వేగాలను కూడా ఎదుర్కోవచ్చు. ఇలాంటి వాటిలో సెక్స్ పట్ల మరింత ఆసక్తి కలగడం కూడా ఉంది. అసలు పీరియడ్స్ కు ముందు ఆడవారిలో సెక్స్ కోరికలు ఎందుకు కలుగుతాయో తెలుసా? 
 

sex life

సెక్స్ గురించి ఒక్కోసారి ఒక్కోలా ఫీలవుతుంటారు. దీనిలో మీ మానసిక స్థితి, భావాలు మారొచ్చు. కొన్నిసార్లు లైంగిక కార్యకలాపాల కోసం వెయిట్ చేయొచ్చు. ఇంకొన్నిసార్లు విసుగ్గా అనిపించొచ్చు. ఇది సర్వ సాధారణం. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే? పీరియడ్స్ సమయంలో ఆడవారు ఎన్నో రకాల భావోద్వేగాలను ఎదుర్కొంటారు. అలాంటి అనుభూతి సెక్స్ పట్ల మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అసలు పీరియడ్స్ కు ముందు సెక్స్ పై కోరికలు ఎందుకు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Image: Getty Images

పీరియడ్స్ ప్రారంభానికి ముందు శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఈ శారీరక మార్పులు హార్మోన్లకు సంబంధించినవి. ఎందుకంటే శరీరంలోని ఎన్నో హార్మోన్లు నెలసరి ప్రారంభానికి ముందే వేగంగా మారుతాయి. రుతుస్రావానికి కొన్ని రోజుల ముందు మహిళల్లో లైంగిక ఉద్రేకం బాగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇలా ఏ ఒక్కరికో.. ఇద్దరికో కాదు ప్రతి ఒక్కరికీ అనిపిస్తుందట. అయితే దీని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి మీరెప్పుడైనా ప్రయత్నించారా? 


పీరియడ్స్ సమయంలో జననేంద్రియ భాగాల్లో రక్తప్రసరణ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. రక్త ప్రవాహం పెరగడం ఆడవారిలో లైంగిక కోరకిలు పెరగడానికి అతిపెద్ద కారణాలలో ఒకటి. అలాగే ఈ సమయంలో ఉత్సర్గ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి కందెనకు కారణమవుతుంది. ఇది యోని పొడిబారడాన్ని తగ్గిస్తుంది. 

పీరియడ్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఆడవారి శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈస్ట్రోజెన్ తో పాటుగా టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అండోత్సర్గము సమయంలో మహిళల్లో ఉద్రేకాన్ని పెంచుతుంది. 
 

Female Masturbations

అండోత్సర్గము తర్వాత ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. ప్రొజెస్టెరాన్ మహిళల్లో ఉబ్బరం, నీటి నిలుపుదలకి కారణమవుతుంది. అలాగే అండోత్సర్గము తర్వాత ఆడవారిలో సెక్స్ డ్రైవ్ తగ్గుతుందని కొంతమంది మహిళల్లో కనుగొనబడింది. ప్రొజెస్టెరాన్ హార్మోన్ స్థాయిలు పీరియడ్స్ కు ముందు, తర్వాత తగ్గుతాయి. ఇది సాధారణంగా మహిళల్లో లైంగిక ప్రేరేపణను పెంచుతుంది.
 

పీరియడ్స్ సమయంలో కూడా.. 

పీరియడ్స్ సమయంలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా తక్కువ. కాబట్టి మహిళలు దీన్ని స్వేచ్ఛగా భావిస్తారు. అందుకే ఈ సమయంలో సెక్స్ లో పాల్గొనాలనుకుంటారు. ఆడవారు పీరియడ్స్ లో ఉన్నప్పుడు.. ప్రెగ్నెన్సీ రాదని మానసికంగా నమ్ముతారు. అందుకే మహిళలు కేర్ ఫ్రీగా ఉండటం ద్వారా శృంగారాన్ని ఆస్వాదించగలుగుతారంటున్నారు నిపుణులు.  పీరియడ్స్ సమయంలో లైంగిక ఉద్రేకం పెరగడానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చంటున్నారు నిపుణులు.

పీరియడ్ సెక్స్ ను ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి

పీరియడ్ సెక్స్ ను ఆస్వాదించడం అస్సలు తప్పు కాదు. కానీ ఈ సమయంలో ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. 

1. పీరియడ్స్ సెక్స్ కు ముందు టాంపోన్లు, మెన్స్ట్రువల్ కప్పులు వంటి ఉత్పత్తులను తొలగించడం మర్చిపోకండి. ఒకవేళ వీటిని మర్చిపోతే అవి యోని లోపలికి వెళ్లే అవకాశం ఉంది. ఇది ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. అందుకే సెక్స్ లో పాల్గొనే ముందు టాంపోన్లు, మెన్స్ట్రువల్ కప్పులను తొలగించండి. 

2. ఎలాగో గర్భం రాదని ప్రొటెక్షన్ ను వాడకుండా ఉండేరు. పీరియడ్ సెక్స్ లో కూడా మీరు ఖచ్చితంగా ప్రొటెక్షన్ ను వాడండి. పీరియడ్స్ సమయంలో ప్రెగ్నెన్సీ రాదు అని చాలా మంది దంపతులు అనుకుంటారు. కాబట్టి వాటిని వాడరు. ఇది కేవలం ప్రెగ్నెన్సీ గురించి మాత్రమే కాదు. ఇది మీ భద్రత గురించి కూడా. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఎస్టీఐల నుంచి కాపాడుతుంది. 

3. పీరియడ్ సెక్స్ లో పాల్గొన్నా, నార్మల్ సెక్స్ లో పాల్గొన్నా సెక్స్ కు ముందు ఆ తర్వాత మీ సన్నిహిత ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా పీరియడ్స్ లో క్లీనింగ్ ఖచ్చితంగా ఉండాలి. పురుష భాగస్వాములు కూడా పరిశుభ్రతపై పూర్తి శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే వారు సంక్రమణకు గురయ్యే ప్రమాదం ఉంది.

Latest Videos

click me!