ప్రేమ (Love) ఎప్పుడూ ఎవరి మీద కలుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రేమ అనేది ఒక అద్భుతమైన నిర్వచనం. ప్రేమ అనేది ఇద్దరి వ్యక్తుల మనసును కట్టిపడేస్తుంది. ప్రేమ భూమి ఉన్నంత కాలం ఉంటుంది. ప్రేమకు చావు లేదు. ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు మొదట వారు ఎటువంటి భేదాభిప్రాయాలను పట్టించుకోరు. ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకొని వారి ప్రేమను తెలియపరచుకుంటారు. ప్రేమకు ఏ కుల (Caste) , మత భేదాలు అడ్డురావు. ప్రేమించుకునేప్పుడు వారి లోకంలో వారు జంట పక్షులాగా ఎవరితో సంబంధం లేకుండా విహరిస్తుంటారు. ప్రేమ అనేది ఒక అనుభూతి, ఆప్యాయత, అనుబంధం. ప్రేమలో ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది.