ఫస్ట్ నైట్ రోజున అమ్మాయిలకు కాస్త కంగారుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య తొలి మూడు రోజులు అత్యంత కీలకం. అమ్మాయితో అబ్బాయి కాస్త ప్రశాంతంగా మాట్లాడాలి. ఆమె అభిప్రాయాలను (Views), అభిరుచులను (Tastes) తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి. మీ జీవన ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాలో చర్చించుకోవాలి. మీ లైఫ్ లో జరిగిన అన్ని విషయాలను ఆమెకు తెలియజేయాలి. మీ కుటుంబ సభ్యుల పట్ల అమ్మాయికి సరైన అవగాహన కల్పించాలి. పుట్టింటిని వదిలి అమ్మాయి అత్తవారింటికి వచ్చినప్పుడు అత్త వారి కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలని అనేది ఆమెకు కాస్త కంగారు, భయం ఉంటుంది.